
హైదరాబాద్: హరితహారంలో భాగంగా మొక్కలు నాటే గ్రీన్ చాలెంజ్‌ను భారత బ్యాడ్మింటన్ ప్లేయర్లు స్వీకరించారు. ముందుగా టాలీవుడ్ డైరెక్టర్ ఎస్‌ఎస్ రాజమౌళి నుంచి చాలెంజ్‌ను స్వీకరించిన బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ మూడు మొక్కలు నాటారు.
అనంతరం గోపీచంద్ భారత ప్రధాని మోడీ, అథ్లెట్ అభినవ్ బింద్రా, బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్‌లకు సవాల్ విసిరారు. దీనికి సంబంధించిన ఫోటోలను తన ట్విట్టర్ ఖాతాలో అభిమానులతో పంచుకున్నారు.
మరో బ్యాడ్మింటర్ ప్లేయర్ పారుపల్లి కశ్యప్ కూడా గ్రీన్ చాలెంజ్‌ను స్వీకరించి మూడు మొక్కలు నాటారు. అనంతరం ఆయన టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి, బిగ్ బాస్ కంటెస్టంట్ ఆదర్శ్, టాలీవుడ్ నటుడు సుశాంత్, స్నూకర్ ఆటగాడు ఆదిత్య మెహతా, నటి శ్రావ్య వర్మకు సవాల్ విసిరారు.
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సిక్కిరెడ్డి సైతం ఈ గ్రీన్ చాలెంజ్‌ను స్వీకరించింది. అనంతరం హీరోయిన్లు తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్, సాయి పల్లవి, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్‌కు ఛాలెంజ్‌ను విసిరారు. మరో బ్యాడ్మింటన్ ఆటగాడు సుమీత్ రెడ్డి మూడు మొక్కలను నాటి తనతోటి బ్యాడ్మింటన్ క్రీడాకారులు కిదాంబి శ్రీకాంత్, ప్రణయ్, సాయి ప్రణీత్‌కు సవాల్ విసిరారు.