తరగని అందం జ్వాలా సొంతం: 33వ పడిలోకి (ట్వీట్స్)
హైదరాబాద్: భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాలా గుత్తా 33వ పడిలోకి అడుగుపెట్టారు. సోమవారం (సెప్టెంబర్ 7) జ్వాలా గుత్తా పుట్టినరోజు. తన పుట్టినరోజు పార్టీని జ్వాలా గుత్తా సహచర క్రీడాకారులతో కలిసి హంగామా చేశారు.
పుట్టినరోజు పార్టీకి సంబంధించిన ఫోటోలను జ్వాలా గుత్తా ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. జ్వాలా గుత్తా పార్టీకి బ్యాడ్మింటన్ స్టార్స్ పీవీ సింధు, జ్వాల డబుల్స్ పార్టనర్ అశ్వినీ పొన్నప్ప, కోన తరుణ్ హాజరయ్యారు. పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేసి సహచర క్రీడాకారులతో కలసి పార్టీ చేసుకున్నారు.

జ్వాలా గుత్తా పుట్టిన రోజు సందర్భంగా ఆమె అభిమానులు ఆమెకు ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలిపారు. జ్వాలా గుత్తాకు కేంద్ర ప్రభుత్వం ఆగస్ట్ 18, 2011న అర్జున అవార్డు ప్రకటించింది. బ్యాడ్మింటన్‌తో పాటు నితిన్ కథానాయకుడిగా నటించిన గుండెజారి గల్లంతయ్యిందే చిత్రంలో జ్వాలా గుత్తా ప్రత్యేక గీతంలో నృత్యం చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications