Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

US Open: క్వార్టర్స్‌లో గాయత్రి- ట్రీసా జోడీ

యూఎస్‌ ఓపెన్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 300 బ్యాడ్మింటన్‌ టోర్నీలో గాయత్రి గోపీచంద్-ట్రీసా జాలీ జోడీ సత్తాచాటుతోంది. మహిళల డబుల్స్ విభాగంలో అదిరే ప్రదర్శనతో క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించింది. ప్రిక్వార్టర్స్‌లో చైనీస్ తైపీ‌కి చెందిన సీ షాన్-హంగ్ జు జంటను 16-21, 21-11, 21-19తో చిత్తుగా ఓడించింది.

తొలి గేమ్‌ను చేజార్చుకున్నప్పటికీ తర్వాత గాయత్రి-ట్రిసా జంట పట్టుదలతో పోరాడింది. రెండో గేమ్‌లో ప్రత్యర్థిపై సంపూర్ణ ఆధిపత్యం చెలాయించింది. ఇక నిర్ణయాత్మక గేమ్‌లో ఎలాంటి పొరపాటు చేయకుండా మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. క్వార్టర్ ఫైనల్‌లో గాయత్రి-ట్రిసా జోడీ ఆరో సీడెడ్, జపాన్‌ ద్వయం రుయి హిరోకామి-యునా కటోతో తలపడనుంది.

Indian Badminton Pair Gayatri Gopichand and Treesa Jolly Power into US Open Quarterfinals

పురుషుల సింగిల్స్‌లో ప్రియాన్షు రజావత్‌ కూడా క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నాడు. చైనీస్ తైపీ ఆటగాడు హువాంగ్ కాయ్‌ను 21-18, 21-16తో మట్టికరిపించాడు. వరుస గేమ్‌ల్లో సత్తాచాటి ప్రత్యర్థిని చిత్తుచేశాడు. ప్రియాన్షు రజావత్ క్వార్టర్స్‌లో చైనా ప్లేయర్ లీ లాన్ జి‌తో అమీతుమి తేల్చుకోనున్నాడు.

మరోవైపు మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో మాళవిక బాన్సోద్‌ కూడా విజయఢంకా మోగించింది. తెరెజా స్వబికోవా (చెక్‌ రిపబ్లిక్‌)పై 15-21, 21-19, 21-14తో గెలుపొందింది. క్వార్టర్స్‌లో స్కాట్లాండ్‌ క్రీడాకారిణి క్రిస్టీ గిల్మర్‌తో మాళవిక పోటీపడనుంది.

Story first published: Saturday, June 29, 2024, 10:41 [IST]
Other articles published on Jun 29, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+