న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పీబీఎల్: సౌరభ్, ప్రణయ్‌ల జోరు.. అహ్మదాబాద్ శుభారంభం

By Nageshwara Rao
India's HS Prannoy, Sourabh Verma star in Ahmedabad Smash Masters' win over NorthEast Warriors

హైదరాబాద్: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో అహ్మదాబాద్ స్మాష్ మాస్టర్స్ శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో 4-3తో నార్త్ ఈస్ట్రన్ వారియర్స్‌పై విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో భాగంగా జరిగిన పురుషుల సింగిల్స్‌లో సౌరభ్ వర్మ 15-10, 15-7తో ప్రతుల్ జోషీపై నెగ్గి శుభారంభాన్నిచ్చాడు.

దీంతో అహ్మదాబాద్ స్మాష్ మాస్టర్స్ 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది. రెండో మ్యాచ్‌లో భాగంగా మిక్స్‌డ్ డబుల్స్‌లో ప్రజక్తా సావంత్-షిన్ బీక్ చియోల్‌ల జోడీ 15-13, 15-13తో కమిల్లా జుల్-లీ చున్ హీ జోడీ చేతిలో ఓటిమి పాలైంది. దీంతో ఇరు జట్ల స్కోర్లు 1-1తో సమం అయ్యాయి.

ఆ తర్వాత మహిళల సింగిల్స్‌ మ్యాచ్‌ని ట్రంప్ మ్యాచ్‌గా అహ్మదాబాద్ స్మాష్ మాస్టర్స్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో వరల్డ్ నెంబర్‌వన్ తై జు 15-6, 15-10తో మిచెల్లి లీపై నెగ్గడంతో అహ్మదాబాద్‌ 3-2 ఆధిక్యంలో నిలిచింది. నాలుగో మ్యాచ్‌లో హెచ్ ఎస్ ప్రణయ్ 15-10, 15-14తో వాంగ్ జు వీపై గెలిచి ఆధిక్యాన్ని 4-2కు పెంచాడు.

ఇక, ట్రంప్ మ్యాచ్‌గా జరిగిన పురుషుల డబుల్స్‌లో వారియర్స్ జోడీ షిన్ బీక్ చియోల్-జుంగ్ 15-8, 15-11తో లీ చున్ హీ రెగినాల్డ్-లీ చు హిమ్‌పై గెలిచి చివర్లో అహ్మదాబాద్ ఆధిక్యాన్ని 4-3కు తగ్గించినప్పటికీ, మ్యాచ్‌లో ఓటమిపాలైంది.

మ్యాచ్ ఫలితాలు:
అహ్మదాబాద్ స్మాష్ మాస్టర్స్ vs నార్త్ ఈస్ట్రన్ వారియర్స్‌
పురుషుల సింగిల్స్: Sourabh Verma bt Pratul Joshi 15-10, 15-7
మిక్స్‌డ్ డబుల్స్: Kamilla Juhl/Lee Chun Hei Reginald lost to Prajakta Sawant/Shin Baek Cheol 13-15, 13-15
మహిళల సింగిల్స్: Tai Tzu Ying (T) bt Michelle Li 15-6, 15-10
పురుషుల సింగిల్స్: Prannoy HS bt Tzu Wei Wang 15-10, 15-14
పురుషుల డబుల్స్: Lee Reginald/Law Cheuk Him lost to Shin Baek Cheol/Kim Gi Jung 8-15, 11-15

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Wednesday, December 27, 2017, 10:33 [IST]
Other articles published on Dec 27, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X