దటీజ్ సింధు, రికార్డ్‌లు: 'ఒంటరి'కి చెక్ చెప్పేనా: ఎవరు, ఎలా ఎదిగింది?
హైదరాబాద్: పీవీ సింధు.. ఈ పేరు ఇప్పుడు అంతటా మార్మోగుతోంది. రియో ఒలింపిక్స్ 2016లో తన కంటే ముందున్న అగ్రశ్రేణి స్పెయన్ క్రీడాకారిణి నోజోమి పైన అద్భుత విజయం సాధించింది. సింధు సెమీ ఫైనల్లో ఆడుతుంటే టీవీలు ఆమె న్యూస్ కవర్ చేశాయి. శుక్రవారం ఉదయం పేపర్లలో ఆమె టాప్. రాజకీయ వార్తలకు ప్రాధాన్యం లేకుండా పోయింది.
గోపీచంద్ అకాడమీలో గత పదేళ్లుగా పీవీ సింధు శిక్షణ పొందుతోంది. తన ఒలింపిక్స్ లక్ష్యాన్ని తన శిష్యుల ద్వారా గోపీచంద్ కలను నెరవేర్చుకుంటున్నారు. నిన్న సైనా నెహ్వాల్, ఇప్పుడు పీవీ సింధు ఒలింపిక్స్‌లో పతకం ఖాయం చేసుకుంటున్నారు.
ఫోటో గ్యాలరీ : రియో దాకా సింధు
2008లో అభినవ్ బింద్రా మినహా వ్యక్తిగత కోటాలో భారత్ ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించలేదు. దీనిపై అభినవ్ బింద్రా ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ఒలింపిక్స్‌లో మన దేశం తరఫున వ్యక్తిగత స్వర్ణం సాధించిన ఆటగాళ్ల జాబితాలో నీ చేరిక కోసం ఎదురు చూస్తున్నానని, ఈ జాబితాలో నన్ను ఒంటరితనం వేధిస్తోందని వ్యాఖ్యానించారు. తద్వారా పీవీ సింధు స్వర్ణం సాధించాలని ఆయన ఆకాంక్షించారు.
- ఒలింపిక్స్‌కు ముందు పీవీ సింధు పైన పెద్దగా ఆశలు లేవని చెప్పవచ్చు. ఇప్పుడు ఆమె పేరు మార్మోగుతోంది. ఈమెకు ఆత్మవిశ్వాసం ఎక్కువ. ఒత్తిడికి గురి కాదు. టాలెంటెడ్ ప్లేయర్. బ్యాడ్మింటన్‌లో సైనా నెహ్వాల్ సత్తా చాటుతుండటంతో పీవీ సింధు పేరు అంతగా తెరపైకి రాలేదు.
- రియో ఒలింపిక్స్ ప్రారంభమయ్యే సమయానికి అందరి ఆశలు సైనా నెహ్వాల్ పైనే. కానీ గాయం కారణంగా ఆమె ఓటమితో వెనుదిరగవలసి వచ్చింది.
- బ్యాడ్మింటన్‌లో ఓ క్రీడాకారిణి కూడా ఫైనల్ దాకా వెళ్లలేదు. సైనా గత ఒలింపిక్సులో కాంస్యం దక్కించుకుంది. ఇప్పుడు సింధు అంతకంటే ముందడుగు వేసింది.
- శుక్రవారం నాడు జరిగే మ్యాచులో సింధు ఫైనల్ గెలిచి స్వర్మం గెలుచుకుంటే.. భారత్ నుంచి స్వర్ణం సాధించిన (సింగిల్ ఈవెంట్) రెండో క్రీడాకారిణి అవుతుంది. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో అభినవ్ బింద్రా బంగారు పతకం గెలిచాడు.
- సెమీ ఫైనల్లో గెలిచిన అనంతరం పీవీ సింధు మాట్లాడుతూ.. తన లక్ష్యం స్వర్ణం అని చెప్పింది. అందుకోసం శాయశక్తులా కృషి చేస్తానని చెప్పింది.
- సెమీ ఫైనల్లో గెలిచి, ఫైనల్లోకి అడుగుపెట్టిన పీవీ సింధుకు హైదరాబాద్ డిస్ట్రిక్ట్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు వీ చాముండేశ్వరినాథ్ బీఎండబ్ల్యు కారు ఇస్తున్నారు.
పీవీ సింధూ ప్రొఫైల్
పూర్తి పేరు: పూసర్ల వెంకట సింధు
పుట్టిన తేదీ: 5 జూలై 1995, హైదరాబాద్
ఎత్తు: ఐదు అడుగుల 9 అంగుళాలు
ఆట: పీవీ సింధుది కుడి చేతి వాటం ఆట
తెలిసిన భాషలు: తెలుగు, హిందీ, ఇంగ్లీష్
కేరీర్: 13 ఏళ్ల క్రితం సింధు కెరీర్ ప్రారంభించింది
ఏ వయసు నుంచి: ఎనిమిదేళ్ల వయస్సు నుంచి ఆడుతోంది. ఇప్పుడు వయస్సు 21.
తల్లిదండ్రులు క్రీడాకారులు: సింధు తల్లిదండ్రులు కూడా క్రీడాకారులు. తండ్రి పీవీ రమణ, తల్లి విజయలు వాలీబాల్ ఆటగాళ్లు.
కోచ్: పుల్లెల గోపీచంద్. హైదరాబాదులోని గోపీచంద్ అకాడమీలో పదేళ్లుగా శిక్షణ పొందుతోంది.
తొలి కోచ్: మెహబూబ్ అలీ
ప్రస్తుత ప్రపంచ ర్యాకింగ్: 10వ ర్యాంక్
సింగిల్ టైటిల్స్: 6. ఇండోనేషియా ఇంటర్నేషనల్ 2011, మలేషియా మాస్టర్స్ (2013, 2016), మకావ్ ఓపెన్ (2013, 2014, 2016)
కాంస్యం: ప్రపంచ ఛాంపియన్ షిప్ 2013 (గాంగ్‌జౌ), ప్పంచ ఛాంపియన్ షిప్‌లో కాంస్యం గెలిచిన తొలి భారత క్రీడాకారిణి.
కాంస్యం: ప్పపంచ ఛాంపియన్ షిప్ 2014(కోపెన్‌హాగెన్)
కాంస్యం: ఇంచియన్ ఏషియన్ గేమ్స్, 2014
కాంస్యం (2): ఉబెర్ కప్ టీమ్ (న్యూఢిల్లీ 2014, కున్షన్ 2016)
కాంస్యం: కామన్ వెల్త్ గేమ్స్ 2014 (సింగిల్స్ కేటగిరీ)
కాంస్యం (2): ఏషియన్ జూనియర్ ఛాంపియన్‌షిప్ (2011 లక్నో - సింగిల్స్, మిక్స్డ్ టీం)
స్వర్ణం: గిమ్‌చియాన్2012 (సింగిల్స్)
స్వర్ణం: డోగ్లాస్ 2011 (సింగిల్స్)
అవార్డులు: పద్మశ్రీ (2015), అర్జున అవార్డు (2013)

ఇదీ పీవీ సింధు ఘనత
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో వరుసగా రెండు కాంస్య పతకాలు గెలిచిన భారత క్రీడాకారిమి పీవీ సింధు. ఇతర భారత క్రీడాకారులెవరూ ఈ ఘనత అందుకోలేదు. ఆసియా క్రీడలు, ఆసియా ఛాంపియన్‌షిప్‌లోనూ కాంస్యం గెలుచుకుంది. ఇవి అరుదైన రికార్డులు

రెండేళ్లుగా..
అయితే పీవీ సింధు రెండేళ్ళుగా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయడం లేదు. ఆటపరంగా తిరుగులేని సింధులో లోపాన్ని గోపీచంద్ గుర్తించారు.

పీవీ సింధు
రియో ఒలింపిక్సులో పీవీ సింధులో పాయింటు పాయింటుకు విజయకాంక్ష పెరగాలన్నది గురువు గోపీచంద్ కోరిక. ఆ ప్రకారం అతను, ఆమె వ్యూహం రచించి, సెమీ ఫైనల్లో గెలిచింది.

దటీజ్ సింధు
క్వార్టర్‌ఫైనల్లో యిహాన్‌ను ఓడించిన సింధు, తనలోని అత్యుత్తమ ఆటను బయటకు తీసింది. అనుభవం, ఆట రెండూ ఉన్న యిహాన్‌ను అనామక క్రీడాకారిణిగా మార్చేసింది.

దటీజ్ సింధు
గురువారం నాడు సెమీ ఫైనల్లో ఒకుహరను మట్టికరిపించింది. సింధుపై 3-1తో మెరుగైన రికార్డున్న ఒకుహరపై చెలరేగి ఆడింది.

రాటుదేలిన సింధు
అగ్రశ్రేణి క్రీడాకారిణుల్ని చిత్తుచేస్తూ మ్యాచ్‌మ్యాచ్‌కూ మరింత రాటుదేలుతోంది పీవీ సింధు. ఒకప్పుడు డిఫెన్స్‌లో బలహీనంగా ఉన్న సింధు.. ఇప్పుడు అందులోనూ దుర్భేధ్యంగా తయారైంది.

ఎత్తును సద్వినియోగం చేసుకుంటూ..
తన ఎత్తును సద్వినియోగం చేసుకుంటున్న సింధు, కోర్టు నలువైపులా తిరుగుతుంది. మెరుపు వేగంతో షటిల్‌ను అందిపుచ్చుకుంటుంది.

సింధు అటాక్
కోర్టు మధ్యలో ఉంటూ రెండు వైపులా షటిల్‌ను సమర్థంగా తిప్పికొడుతోంది. అదే సమయంలో ప్రత్యర్థికి రెండు వైపులా క్రాస్‌కోర్ట్ షాట్‌లు సంధిస్తోంది.

సింధు వేగం
సింధులో వేగం కూడా కనిపిస్తోంది. కెరీర్‌లోనే అత్యుత్తమ ఫిట్‌నెస్‌తో ఉంది. వేగంలో బాగా పుంజుకుంది. తల్లిదండ్రులు కూడా ప్రస్తుతం మంచి ఫాంలో ఉందని చెబుతున్నారు.

పీవీ సింధు
ప్రస్తుతం మహిళల సింగిల్స్‌లో అత్యంత చురుకైన క్రీడాకారిణి ఒకుహర లాంటి క్రీడాకారిణిని సింధు ఘోరంగా ఓడించింది. వరుస సెట్లలో గెలవడం గమనార్హం.

అలసిపోని సింధు
కోర్టులో అన్ని మూలలకు ఆమెను పరుగెత్తించి అలసిపోయేలా చేసింది సింధు. ఒకుహర కంటే ఎక్కువే మైదానంలో కదిలిన సింధు ముఖంలో ఎక్కడా అలసట కనిపించలేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications