
అదరగొట్టిన లక్ష్యసేన్
ఇండియా ఓపెన్ 500 టోర్నీలో పురుషుల విభాగంలో భారత యువ ఆటగాడు లక్ష్యసేన్ అదరగొట్టాడు. గత నెలలో కొత్త ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన కీన్ యుతో ఫైనల్‌లో తలపడిన లక్ష్యసేన్ చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో సంచలన విజయం నమోదు చేశాడు. మొత్తం 54 నిముషాల పాటు సాగిన ఈ పోరులో లక్ష్యసేన్ 24-22, 21-17 తేడాతో గెలుపొందాడు. దీంతో తన కెరీర్‌లో తొలి సారి 500 టోర్నీ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. హోరా హోరీగా సాగిన ఈ పోరులో తొలి గేమ్‌లో 19-20, 21-22 వద్ద రెండు సార్లు గేమ్ పాయింట్లను సాధించి తొలి సెట్‌ను కైవసం చేసుకున్నాడు.
ఇక రెండో సెట్‌లో అధిపత్యం చెలాయించిన లక్ష్యసేన్ చివరి వరకు అదే ఊపు కొనసాగించి సెట్‌ను 21-17 తేడాతో కైవసం చేసుకోని ఇండియా ఓపెన్ విజేతగా నిలిచాడు. విజేతగా నిలిచిన లక్ష్యే సేన్‌కు 30 వేల డాలర్ల ( 22 లక్షల 24 వేల రూపాయలు) ప్రైజ్‌మనీ లభించింది. కాగా 20 ఏళ్ల లక్ష్యసేన్ గత నెలలో ప్రపంచ చాంపియన్ షిప్‌లో కాంస్యం నెగ్గిన సంగతి తెలిసిందే.

డబుల్స్ కూడా మనదే
ఇక మెన్స్ డబుల్స్‌లోనూ భారత ఆటగాళ్లు విజేతగా నిలిచారు. డబుల్స్ ఫైనల్‌లో ప్రపంచ పదో ర్యాంక్ జంట సాత్విక్-చిరాగ్ శెట్టి 21-16, 26-24తో టాప్ సీడ్ ఎహ్‌సాన్-సెతియవాన్ జంటను ఓడించి టైటిల్ కైవసం చేసుకుంది. ఎహ్‌సాన్-సెతియవాన్ జంటతో 43 నిమిషాలపాటు హోరాహోరీగా జరిగిన ఫైనల్లో సాత్విక్-చిరాగ్ జంట నిలకడగా ఆడి విజేతగా నిలిచింది. తొలి గేమ్‌లో 13-13తో స్కోరు సమంగా ఉన్న దశలో సాత్విక్-చిరాగ్ ఒక్కసారిగా చెలరేగి ఆడారు. వరుసగా ఐదు పాయింట్లు గెలిచి 18-13తో ఆధిక్యంలోకి వచ్చింది.
తర్వాత అదే ఊపును కొనసాగించి తొలి సెట్‌ను గెలుచుకుంది. ఇక రెండో సెట్ హోరా హోరీగా సాగింది. అయితే 26-24తో భారత జంటనే చివరికి సెట్‌ను కైవసం చేసుకోని టైటిల్ గెలుచుకుంది. టైటిల్ విజేతగా నిలిచిన సాత్విక్-చిరాగ్ జోడీకి 31,600 డాలర్లు ( 23 లక్షల 43 వేల రూపాయలు) ప్రైజ్‌మనీగా లభించాయి.

నిరాశ పరిచిన సింధు
ఈ టోర్నీలో హాట్ ఫెవరేట్‌గా బరిలోకి దిగిన పీవీ సింధు సెమీఫైనల్‌లోనే ఓడి తీవ్రంగా నిరాశ పరిచింది. అలాగే మరో తెలుగు క్రీడాకారిణి సైనా నెహ్వాల్ కూడా తీవ్రంగా నిరాశ పరిచింది. సైనా ఏకంగా రెండో రౌండ్‌లోనే ఓడిపోయి ఇంటి దారి పట్టింది.


Click it and Unblock the Notifications












