న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హైదరాబాద్‌ ఓపెన్‌తో బ్యాడ్మింటన్‌ షురూ.. ఐదు నెలల్లో 22 టోర్నమెంట్‌లు!!

India Open Set for December as BWF Announces Fresh Calendar After Covid-19 Stoppage

ఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన క్రీడా ఈవెంట్లు ఒక్కొక్కటిగా మళ్లీ పట్టాలెక్కుతున్నాయి. తాజాగా బ్యాడ్మింటన్‌లోనూ టోర్నీల నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఆగస్టులో హైదరాబాద్‌ ఓపెన్‌తో అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ ఈవెంట్‌ ప్రారంభం కానుంది. ఈ మేరకు ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) ఈ ఏడాది షెడ్యూల్‌ను శుక్రవారం ప్రకటించింది.

'ధోనీ బటర్ చికెన్, బిర్యానీ బాగా తింటాడు.. జిమ్‌లో శ్రమించడు.. అయినా అలా ఎలా''ధోనీ బటర్ చికెన్, బిర్యానీ బాగా తింటాడు.. జిమ్‌లో శ్రమించడు.. అయినా అలా ఎలా'

ఆగస్టు 11 నుంచి 16 వరకు హైదరాబాద్‌లో జరిగే టోర్నీతో ప్రపంచ బ్యాడ్మింటన్‌ క్యాలెండర్‌ మొదలవుతుంది. హైదరాబాద్‌ ఓపెన్‌ కాకుండా.. సయ్యద్‌ మోదీ ఇంటర్నేషనల్‌ టోర్నీ (నవంబర్‌ 17-22), ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ ఈవెంట్‌ ఇండియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌-500 టోర్నీ (డిసెంబర్‌ 8-13) కూడా భారత్‌లో జరుగనున్నాయి.

నిజానికి ఇండియా ఓపెన్‌ మార్చి 24-29 వరకు జరగాల్సి ఉండగా కరోనా ధాటికి వాయిదా పడింది. సవరించిన క్యాలెండర్‌ ప్రకారం బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ స్థాయి టోర్నీలు తైపీ ఓపెన్‌ సూపర్‌ 300 (సెప్టెంబర్‌ 1-6)తో ప్రారంభం కాను న్నాయి. అనంతరం డెన్మార్క్‌ ఓపెన్‌ (అక్టోబర్‌ 3-11) జరుగనుంది. వీటితో పాటు 8 ప్రముఖ అంతర్జాతీయ టోర్నీలను రీషెడ్యూల్‌ చేశారు.

అయితే బీడబ్ల్యూఎఫ్‌ సవరించిన షెడ్యూల్‌పై భారత అగ్రశ్రేణి క్రీడాకారులు సాయిప్రణీత్, పారుపల్లి కశ్యప్, సైనా నెహ్వాల్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఐదు నెలల కాలంలో ఏకంగా 22 అంతర్జాతీయ టోర్నీలు ఉండటమేంటని వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కరోనా కారణంగా ఇంట్లోనే ఉన్నామని, అసలు ఆటగాళ్లు ఇంకా ప్రాక్టీసే ప్రారంభించలేదని, ప్రాక్టీస్‌ మొదలుపెట్టాక మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ సంతరించుకోవడానికి కనీసం రెండు నెలల సమయం పడుతుందని సాయిప్రణీత్‌ అన్నాడు.

Story first published: Saturday, May 23, 2020, 11:14 [IST]
Other articles published on May 23, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X