న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇండియా ఓపెన్‌: ప్రిక్వార్టర్‌లోకి సింధు, శ్రీకాంత్‌

India Open: PV Sindhu, Kidambi Srikanth advance to second round

హైదరాబాద్: ఇండియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్ షట్లర్లు శుభారంభం చేశారు. పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్‌, సాయిప్రణీత్‌, ప్రణయ్‌, సమీర్‌వర్మ ప్రిక్వార్టర్‌లోకి అడుగుపెట్టారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌ మ్యాచ్‌లో సింధు 21-8, 21-13తో ముగ్ధా ఆగ్రే (భారత్‌)పై... పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్‌ 21-16, 18-21, 21-19తో వోంగ్‌ వింగ్‌ కి విన్సెంట్‌ (హాంకాంగ్‌)పై గెలిచారు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఇతర తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో సమీర్‌ వర్మ 21-18, 21-12తో రాస్‌ముస్‌ గెమ్కె (డెన్మార్క్‌)పై, సాయిప్రణీత్‌ 22-24, 21-18, 21-8తో కార్తికేయ్‌ (భారత్‌)పై, కశ్యప్‌ 14-21, 21-18, 21-10తో లీ చెయుక్‌ (హాంకాంగ్‌)పై, శుభాంకర్‌ 14-21, 22-20, 21-11తో నాలుగో సీడ్‌ టామీ సుగియార్తో (ఇండోనేసియా)పై, ప్రణయ్‌ 14-21, 21-18, 21-14తో వాంగ్‌చరోయెన్‌ (థాయ్‌లాండ్‌)పై గెలిచారు.

గురుసాయిదత్‌ 18-21, 11-21తో సితికోమ్‌ తమసిన్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో, రాహుల్‌యాదవ్‌ 14-21, 6-21తో జాన్‌ జొర్గెన్సెన్‌ (డెన్మార్క్‌) చేతిలో ఓడారు. మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్లో రెండో సీడ్‌ సింధు 21-8, 21-13తో ముగ్ధపై అలవోక విజయాన్ని నమోదు చేసింది. రియా ముఖర్జీ 21-17, 21-15తో చైవాన్‌ (థాయ్‌లాండ్‌)పై గెలిచింది.

వృశాలి 21-17, 20-22, 12-21తో చనాంచిద (థాయ్‌లాండ్‌) చేతిలో, సాయి ఉత్తేజితరావు 9-21, 6-21తో ఇంతానన్‌ రచనోక్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో ఓడారు. భారత్‌కే చెందిన రాహుల్‌ యాదవ్‌ 14-21, 6-21తో జార్గెన్‌సన్‌ (డెన్మార్క్‌) చేతిలో, అజయ్‌ జయరామ్‌ 15-21, 18-21తో వాంగ్‌జు వె (చైనీస్‌ తైపీ) చేతిలో ఓడారు.

Story first published: Thursday, March 28, 2019, 9:32 [IST]
Other articles published on Mar 28, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X