
గాయం కారణంగా వైదొలిగాడు:
ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య కొత్త నిబంధన కారణంగా బుధవారం ప్రణయ్ తీవ్రంగా ఇబ్బందిపడ్డాడు. ఐతే గాయం కారణంగా ఈ ఏడాది తొలి రెండు సూపర్ 500 టోర్నీలకు ప్రపంచ నం.10 ప్రణయ్ దూరమయ్యాడు. తప్పక ఆడాల్సిన పరిస్థితుల్లో స్వదేశంలో అతడు బరిలో దిగాడు. పాదం మోపేందుకు కుదరని పరిస్థితుల్లో సైతం గురువారం చాలా ఇబ్బందిగా కదిలాడు. అలాగని మ్యాచ్‌ను వదిలేస్తే కుదరదు.

ఆడకపోతే మైనస్ పాయింట్లలోకి:
ఎందుకంటే ప్రత్యర్థి భారత ఆటగాడే. సొంత దేశానికి చెందిన షట్లర్‌తో మ్యాచ్‌ను వదిలేసుకుంటే ర్యాంకింగ్ పాయింట్లు కోల్పోతాడు. దీంతో మ్యాచ్ ముగిసే వరకు కోర్టులో ఉన్న ప్రణయ్ 4-21, 6-21తో శ్రేయాంష్ జైస్వాల్ చేతిలో ఓడిపోయాడు.

స్టార్ ప్లేయర్లు అదే స్థాయిలో:
మహిళల విభాగంలో ఫేవరెట్లు పి.వి. సింధు, సైనా నెహ్వాల్ శుభారంభం చేశారు. గతవారం ఇండోనేషియా ఓపెన్‌లో ఫైనలిస్టుగా నిలిచి ఫామ్‌లోనున్న సైనా 21-15, 21-9తో డెన్మార్క్ షట్లర్ సోఫీ హోల్బ్‌బెపై, డిఫెండింగ్ చాంపియన్ సింధు 21-10, 21-13తో డెన్మార్క్‌కే చెందిన నటాలియా కోచ్ రోడ్‌పై, రుత్విక 21-17, 21-10తో అమెలి హెర్ట్స్ (డెన్మార్క్)పై విజయం సాధించి ప్రీక్వార్టర్స్ చేరారు.

సాయి ప్రణీత్‌తో కలిసి:
ఇతర మ్యాచ్‌ల్లో రెండో సీడ్ కిదాంబి శ్రీకాంత్ 21-17, 21-18తో లీ చువుక్ యు (హాంకాంగ్)పై, సాయి ప్రణీత్ 21-11, 17-21, 21-17తో రాజీవ్ ఔసెఫ్‌పై, కశ్యప్ 21-14, 21-18తో హన్స్ క్రిస్టియన్ సోల్బర్గ్ (డెన్మార్క్)పై విజయం సాధించాడు. సమీర్ వర్మ 22-20, 21-8తో ఏడో సీడ్ ఆండర్స్ ఆంటోన్సెన్ (డెన్మార్క్)కు షాకిచ్చాడు.

ప్రణవ్ చోప్రా-సిక్కి రెడ్డి:
మిక్స్‌డ్ డబుల్స్ తొలి రౌండ్లో ప్రణవ్ చోప్రా-సిక్కిరెడ్డి 16-21, 21-17, 21-17తో హఫీజ్-గ్లోరియా (ఇండోనేషియా)పై, మను అత్రి-సుమీత్ 21-7, 21-13తో ఆదర్శ్-జగదీశ్‌పై, సాత్విక్ సాయిరాజ్-అశ్విని 21-9, 21-10తో రాజు-అనీస్‌పై గెలిచారు. డబుల్స్ స్పెషలిస్ట్ సిక్కిరెడ్డి డబుల్స్, మిక్స్‌డ్ రెండు విభాగాల్లోనూ రెండోరౌండ్ చేరింది. సాత్విక్‌సాయిరాజ్-అశ్విని, శివమ్-పూర్వీశా జోడీలు మిక్స్‌డ్‌లో ప్రీ క్వార్టర్స్ చేరారు.


Click it and Unblock the Notifications











