ఆసియా బ్యాడ్మింటన్‌ టీమ్‌ చాంపియన్‌షిప్స్: భారత్‌కు మళ్లీ కాంస్యమే..!

మనీలా (ఫిలిప్పీన్స్‌): ప్రతిష్టాత్మక ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్‌షిప్‌లో భారత్ రెండో సారి కాంస్యంతోనే సరిపెట్టుకుంది. డిఫెండింగ్ చాంపియన్ ఇండోనేసియాతో శనివారం జరిగిన సెమీఫైనల్లో భారత్ 2-3తో ఓడి ఫైనల్ చేరే అవకాశాన్ని చేజార్చుకుంది.

ఆసియాడ్‌ చాంపియన్‌ జొ నాథన్‌ క్రిస్టీపై యువ రాకెట్‌ లక్ష్య సేన్‌ సంచలన విజయం వృథా అయింది. తొలి సింగిల్స్‌ మ్యాచ్‌లో ఆంథోనీ సునిసికా జింటింగ్‌తో పోరులో 6-21తో వెనుకంజలో ఉన్నప్పుడు సాయి ప్రణీత్‌ రిటైరయ్యాడు. అయితే, తర్వాత జరిగిన మ్యాచ్‌లో లక్ష్య సేన్‌ 21-18, 22-20తో జొనాథన్‌ క్రిస్టీపై నెగ్గి 1-1తో స్కోరు సమం చేశాడు.

డబుల్స్‌లో అర్జున్‌-ధ్రువ్‌ కపిల జంట 10-21, 21-14, 21-23తో ఎహ్‌సాన్‌-హెంద్ర సెథియవాన్‌ జోడీ చేతిలో ఓడింది. మరో సింగిల్స్‌లో శుభాంకర్‌ డే 21-17, 21-15తో రుస్తావిటోపై నెగ్గి 2-2తో స్కోరు సమం చేశారు. కానీ, నిర్ణయాత్మక డబుల్స్‌ మ్యాచ్‌లో లక్ష్య సేన్‌-చిరాగ్‌ షెట్టి 6-21, 13-21తో ఫెర్నాల్డి గిడియన్‌-కెవిన్‌సుకముల్జో చేతిలో పరాజయంతో భారత్‌ ఓటమి ఖరారైంది. 2016లోనూ భారత పురుషుల టీమ్ సెమీఫైనల్లో ఇండోనేసియా చేతిలో ఓటమిపాలై కాంస్య పతకాన్ని దక్కించుకుంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Sunday, February 16, 2020, 8:55 [IST]
Other articles published on Feb 16, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X