
హైదరాబాద్: హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరిస్‌లో వరల్డ్ నెంబర్ 13 ర్యాంకర్, భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ ఫామ్‌ని అందుుకున్నాడు. ఐదో సీడ్ చెన్‌లాంగ్ (చైనా) గాయం కారణంగా మ్యాచ్ మధ్యలోనే తప్పుకోవడంతో కిదాంబి శ్రీకాంత్ హాంకాంగ్ ఓపెన్‌లో సెమీ ఫైనల్ చేరుకున్నాడు.
ఈ టోర్నీలో అన్‌సీడ్‌గా బరిలోకి దిగిన కిదాంబి శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్ తొలి గేమ్‌ను కేవలం 15 నిమిషాల్లోనే ముగించి 21-13తో కైవసం చేసుకున్నాడు. ఇక, రెండో గేమ్‌కు సన్నద్ధమయ్యే క్రమంలో గాయం ఇబ్బంది పెట్టడంతో చెన్‌లాంగ్ మ్యాచ్ నుంచి తప్పుకుని శ్రీకాంత్‌కు వాకోవర్ ఇచ్చాడు.
లీ చెక్ యూ (హాంకాంగ్)-విక్టర్ అక్సెల్‌సెన్ (డెన్మార్క్) మధ్య జరిగే క్వార్టర్స్ ఫైనల్స్ మ్యాచ్ విజేతతో శనివారం కిదాంబి శ్రీకాంత్ సెమీస్‌లో తలపడనున్నాడు. హాంకాంగ్‌లో జరుగుతున్న సూపర్ 500 టోర్నమెంట్‌లో కిదాంబి శ్రీకాంత్‌ని అదృష్టం వరించింది. ప్రపంచ ఛాంపియన్ కెంటో మోమోటా తొలి రౌండ్‌లో తప్పుకోవడంతో శ్రీకాంత్ రెండో రౌండ్‌కు చేరుకున్నాడు.
కాగా, చెన్‌లాంగ్‌పై శ్రీకాంత్‌కు ఇది రెండో విజయం. వీరిద్దరూ 8 సార్లు తలపడగా చెన్‌లాంగ్ ఆరు సార్లు నెగ్గాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన మలేసియా ఓపెన్ సూపర్ సిరిస్‌లో వీరిద్దరూ క్వార్టర్‌లో తలపడగా చెన్‌లాంగ్ వరుస గేముల్లో విజయం సాధించాడు. 2017 ఆస్ట్రేలియా ఓపెన్‌లో తొలిసారి చెన్‌లాంగ్‌ను ఓడించి శ్రీకాంత్ టైటిల్ విజేతగా నిలిచాడు.