సిఎంతో జ్వాల భేటీ: ప్రధానికి కెసిఆర్ లేఖ(పిక్చర్స్)
హైదరాబాద్: రియో ఒలింపిక్స్‌లో పతకమే లక్ష్యంగా క్రీడాకారులను తీర్చిదిద్దడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన టార్గెట్ ఒలింపిక్ పోడియం (టాప్) పథకంలో స్టార్ షట్లర్ గుత్తా జ్వాలకు చోటు దక్కకపోవడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పందించారు. ఇటీవల కెనడా ఓపెన్ ఛాంపియన్‌షిప్‌లో డబుల్స్ టైటిల్ నెగ్గిన జ్వాల, ఎంపి కవితతో కలిసి శుక్రవారం ముఖ్యమంత్రిని కలుసుకుంది.
ఈ సందర్భంగా టాప్ పథకం తమకూ వర్తింపజేసేలా చూడాల్సిందిగా సీఎంకు జ్వాల విన్నవించుకుంది. వెంటనే స్పందించిన కేసీఆర్, ఈ విషయమై ప్రధాని నరేంద్ర మోడీకి, కేంద్ర క్రీడలమంత్రి సర్బనంద సోనోవాల్‌కు లేఖ రాశారు.
అంతర్జాతీయస్థాయిలో ఎన్నో టైటిళ్లు గెలిచి భారత్‌కు ఖ్యాతి తీసుకొచ్చిన జ్వాల, అశ్విని పొన్నప్పలకూ ఈ పథకం కింద తగిన ప్రోత్సాహకాలను అందించేలా చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. ఒలింపిక్స్‌లో పతకం సాధించే సత్తా కలిగిన క్రీడాకారుల కోసం ప్రవేశపెట్టిన టాప్ పథకంలో జ్వాలతో పాటు ఆమె భాగస్వామి అశ్వినీ పొన్నప్పల పేర్లు చేర్చలేదని తెలిసింది.
'జ్వాల ప్రతిభగల క్రీడాకారిణి అన్న సంగతి మీకు తెలుసు. జ్వాల ప్రస్తుతం ప్రపంచ 13వ ర్యాంక్ క్రీడాకారిణిగా కొనసాగుతున్నారు. అంతర్జాతీయస్థాయిలో అద్భుత మైన విజయాలు సాధించారు. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకం సాధించిన తొలి భారత మహిళగా నిలిచారు అని లేఖలో పేర్కొన్నారు.
'ఒలింపిక్స్‌లో రెండు విభాగాల్లో అర్హత సాధించిన తొలి క్రీడాకారిణిగానూ ఆమెకు రికార్డుంది. 2010 కామన్వెల్త్‌గేమ్స్‌లో స్వర్ణం, 2014లో రజతపతకం సాధించారు. ఇటీవలే కెనడా ఓపెన్ టైటిల్‌నూ నెగ్గారు. ఆ సందర్భంగా గౌరవ రాష్ట్రపతితో పాటు మీరూ అభినందనలు తెలిపారు. ఈ నేపథ్యంలో నేను మిమ్మల్ని కోరేది ఒక్కటే. జ్వాల, అశ్వినీలకు ఈ పథకం వర్తించేలా వీలైనంత త్వరగా ఆదేశాలివ్వండి. వీళ్లు భారత్‌కు ఒలంపిక్ తెస్తారన్న నమ్మకం నాకుంది' అని ప్రధానికి రాసిన లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు.
కాగా, కేంద్రం నుంచే గాక, రాష్ట్ర ప్రభుత్వం తరఫునా జ్వాలకు పూర్తి సహకారముంటుందని సిఎం కెసిఆర్ ప్రకటించారు. అకాడమీ ఏర్పాటు చేయదలచుకుంటే అందుకు కావాల్సిన పూర్తి ఏర్పాట్లను తమ ప్రభుత్వం చూసుకుంటుందని హామీ ఇచ్చారు.

కెసిఆర్‌తో గుత్తా జ్వాల
రియో ఒలింపిక్స్‌లో పతకమే లక్ష్యంగా క్రీడాకారులను తీర్చిదిద్దడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన టార్గెట్ ఒలింపిక్ పోడియం (టాప్) పథకంలో స్టార్ షట్లర్ గుత్తా జ్వాలకు చోటు దక్కకపోవడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పందించారు.

కెసిఆర్‌తో గుత్తా జ్వాల
ఇటీవల కెనడా ఓపెన్ ఛాంపియన్‌షిప్‌లో డబుల్స్ టైటిల్ నెగ్గిన జ్వాల, ఎంపి కవితతో కలిసి శుక్రవారం ముఖ్యమంత్రిని కలుసుకుంది.

కెసిఆర్‌తో గుత్తా జ్వాల
ఈ సందర్భంగా టాప్ పథకం తమకూ వర్తింపజేసేలా చూడాల్సిందిగా సీఎంకు జ్వాల విన్నవించుకుంది.

కెసిఆర్‌తో గుత్తా జ్వాల
వెంటనే స్పందించిన కేసీఆర్, ఈ విషయమై ప్రధాని నరేంద్ర మోడీకి, కేంద్ర క్రీడలమంత్రి సర్బనంద సోనోవాల్‌కు లేఖ రాశారు.

కెసిఆర్‌తో గుత్తా జ్వాల
అంతర్జాతీయస్థాయిలో ఎన్నో టైటిళ్లు గెలిచి భారత్‌కు ఖ్యాతి తీసుకొచ్చిన జ్వాల, అశ్విని పొన్నప్పలకూ ఈ పథకం కింద తగిన ప్రోత్సాహకాలను అందించేలా చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications