
హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్‌కు ఐఐటీ కాన్పూర్ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. శుక్రవారం జరిగిన ఐఐటీ కాన్పూర్ 52వ స్నాతకోత్సవంలో ఇస్రో మాజీ చైర్మన్, ఐఐటీ కాన్పూర్ బోర్డు ఆఫ్ గవర్నర్స్ చైర్మన్ ప్రొఫెసర్ కె రాధాకృష్ణన్ నుంచి గోపీ డాక్టరేట్ అందుకున్నాడు.
భారత బ్యాడ్మింటన్‌లో చేస్తోన్న సేవలకు గాను గోపీచంద్‌కు ఈ గౌరవం దక్కింది. దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గతంలో కాన్పూర్ ఐఐటీ డాక్టరేట్ అందుకున్నవారిలో ఉన్నారు.