న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇందిరానగర్ క్లబ్ బ్యాడ్మింటన్ రెండో సీజన్‌కు ఇదే సమయం

IBL 2018: Its time for quality badminton action

హైదరాబాద్: నవంబరు 11న జరగనున్న వేలం ద్వారా ఇందిరానగర్ బ్యాడ్మింటన్ లీగ్‌లో రెండో సీజన్ ఆరంభం కానుంది. పురుషులు, మహిళలు, చిన్నారులు మూడు విభాగాలుగా విభజించి 150మందితో ఈ ఏడాది లీగ్‌ను మరింత ఘనంగా జరపనుంది. నవంబరు 30 నుంచి డిసెంబరు 8వరకూ జరగనున్న లీగ్ గతేడాది కంటే మెరుగైన స్థాయిలో ఏర్పాట్లు చేస్తుంది. మొదటి లీగ్ 116 ప్లేయర్లతో నాలుగు జట్లుగా జరగ్గా ఐదు జట్లతో 150మంది ప్లేయర్లతో మన ముందుకు రానుంది.

ఇందిరానగర్ క్లబ్ బ్యాడ్మింటన్ లీగ్ కమిషనర్ నీరజ్ మిశ్రా మాట్లాడుతూ.. బ్యాడ్మింటన్‌ బెంగళూరులో ఓ మరపురాని సంప్రదాయంగా మారింది. 2017 ఆరంభ సీజన్‌లో కంటే ఈ ఏడాది ప్లేయర్ల జాబితా పెంచి 150కి పరిమితం చేశాం. అంతకంటే ఎక్కువ అయితే క్లబ్ పరిధి దాటిపోతోంది. ఈ 150మంది జాబితా కూడా చాలా త్వరగా నిండిపోయింది.' అంటూ ఈ ఏడాది జరగనున్న లీగ్ గురించి ప్రసంగించారు.

ఇందిరానగర్ బ్యాడ్మింటన్ లీగ్‌ ఛైర్ పర్సన్ కళ్యాణ్ మోహన్ మాట్లాడుతూ.. 'ఆటగాళ్ల మధ్యలో బెరకు.. సంశయం వాటికి దూరంగా ఉండాలి. ఒక్కసారి కోర్టులో అడుగుపెడితే గెలిచేందుకే పోరాడాలి. దాంతో పాటుగా సహచర ప్లేయర్లతో మంచి ప్రవర్తనతో మెలగాలి. యువ ప్లేయర్లకు ఇదొక మంచి ప్లాట్ ఫాం' అనే ఆశాభావం వ్యక్తం చేశారు.

గతేడాది కంటే ఎక్కువ మంది స్పాన్సర్లు రావడంతో ఈ లీగ్ వ్యాపార పరంగా కూడా మంచి వృద్ధిని సాధించిందని చెప్పుకోవచ్చు. గినా గ్రూప్, ప్రీమా డయాగ్నొస్టిక్స్, ఇందిరానగర్ క్లబ్, టైటాన్, తాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్, ఇంగ్లీష్ బ్రూయింగ్ కంపెనీ, యోనెక్స్ వంటి కంపెనీలు ప్రధాన పెట్టుబడిదారులుగా వస్తున్నాయి. ఈక్రమంలో లీగ్ విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులను, రివార్డులను ప్రకటించింది యాజమాన్యం.

ఓ సందర్భంలో ఇందిరానగర్ బ్యాడ్మింటన్ లీగ్ గురించి బాస్కెట్ బాల్ లెజెండ్ మైకేల్ జోర్డాన్ మాట్లాడుతూ.. 'ఆడాలి.. సరదాగా ఎంజాయ్ చేయాలి..' ఇంతకుముందు ఐబీఎల్‌ను వర్ణించడానికి వేరే ఏమీ చెప్పనవసర్లేదు.' అని అన్నాడు.

Story first published: Friday, November 9, 2018, 15:12 [IST]
Other articles published on Nov 9, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X