Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'ఆర్థిక సాయం చేయండి.. అంతర్జాతీయ టోర్నీల్లో ఆడతా'

I need funds to play more international tournaments: National Champion Sourabh Verma

హైదరాబాద్: ఆర్థిక సాయం చేస్తే అంతర్జాతీయ టోర్నీల్లో సత్తా చాటుతానని జాతీయ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌ సౌరభ్‌ వర్మ అన్నాడు. ప్రస్తుతం తాను తిరిగి ఫామ్‌లోకి రావాలంటే ప్రాక్టీస్‌ చేయాలని.. అందుకు తన వద్ద డబ్బుల్లేవని... ప్రభుత్వం చేయూతనిస్తే తన ర్యాంకును మెరుగు పరుచుకుంటానని చెప్పుకొచ్చాడు.

26 ఏళ్ల సౌరభ్ వర్మ ఎనిమిదేళ్ల క్రితమే 2011లో సీనియర్‌ జాతీయ చాంపియన్‌గా నిలిచినప్పటికీ... మంచి శిక్షణకు నోచుకోకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, గాయాలు తదితర కారణాలతో తరచూ టోర్నీలకు దూరమవుతున్నాడు. 2012లో కెరీర్‌ బెస్ట్‌ 30వ ర్యాంకుకు చేరుకున్న సౌరభ్‌ ఇప్పుడు 55వ ర్యాంకుకు పడిపోయాడు.

సౌరభ్‌ వర్మ మీడియాతో మాట్లాడుతూ

సౌరభ్‌ వర్మ మీడియాతో మాట్లాడుతూ

ప్రస్తుతం తన పరిస్థితిపై సౌరభ్‌ వర్మ సోమవారం మీడియాతో మాట్లాడుతూ "అంతర్జాతీయ టోర్నీలు ఆడేంత స్థోమత నాకు లేదు. నాకు ఆర్థిక చేయూత లేదు. అంతర్జాతీయ టోర్నీలు ఆడాలనేది ప్రతి క్రీడాకారుడి కల. దాన్ని సాకారం చేసుకోవాలనే నేను కూడా ప్రయత్నిస్తున్నాను. కానీ, నాకు ఆర్థిక ఇబ్బందులున్నాయి" అని తెలిపాడు.

బాయ్ కొత్త నిబంధనల ప్రకారం

బాయ్ కొత్త నిబంధనల ప్రకారం

"బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా(బాయ్) కొత్త నిబంధనల ప్రకారం టాప్‌ 25 మంది ప్లేయర్లు మాత్రమే ఆర్థిక సాయం పొందుతున్నారు. ఈ కొత్త నిబంధన నాకు శాపమైంది. కేవలం టాప్‌-25 ర్యాంకర్లకు మాత్రమే భారత బ్యాడ్మింటన్‌ సంఘం (బాయ్‌) ఆర్థిక సాయం చేస్తుంది. దీంతో నాకు అంతర్జాతీయ టోర్నీలు ఆడే అవకాశం కష్టమైంది. దీంతో నా ర్యాంక్ కూడా దిగజారింది" అని చెప్పుకొచ్చాడు.

నా సొంత ఖర్చుతోనే కొన్ని టోర్నీలకు

నా సొంత ఖర్చుతోనే కొన్ని టోర్నీలకు

"నేను మరిన్ని పాయింట్లు నా ఖాతాలో వేసుకోవాలంటే కనీసం 10-12 టోర్నమెంట్లయినా ఆడాలి. గతేడాది నేను మోకాలి గాయంతో బాధపడ్డాను. దీంతో విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. నేను నా సొంత ఖర్చుతోనే కొన్ని టోర్నీలు ఆడాను. ఒక క్రీడాకారుడిగా ఇంత ఖర్చు భరించడం చాలా కష్టం. ప్రస్తుతం నా ఆవేదన ఎవరికైనా అర్థమై నాకు సాయం చేస్తారని కోరుకుంటున్నా" అని సౌరభ్ వర్మ తెలిపాడు.

సౌరభ్ వర్మకు మూడో టైటిల్‌

సౌరభ్ వర్మకు మూడో టైటిల్‌

"త్వరలో స్విస్‌ ఓపెన్, ఒర్లియన్స్‌ ఓపెన్‌ ఆడేందుకు వెళుతున్నా. దీనికి అయ్యే ఖర్చంతా నాదే" అని సౌరభ్ వర్మ చెప్పాడు. గాయం నుంచి కోలుకున్నాక గతేడాది సౌరభ్‌ వర్మ రష్యా ఓపెన్, డచ్‌ ఓపెన్‌లలో టైటిల్స్‌ గెలిచాడు. ఇటీవలే గౌహతి వేదికగా ముగిసిన జాతీయ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లోనూ విజేతగా నిలిచాడు. ఇది సౌరభ్ వర్మకు మూడో టైటిల్‌ కావడం విశేషం.

Story first published: Tuesday, February 19, 2019, 12:25 [IST]
Other articles published on Feb 19, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+