Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సింధు, సైనా నెహ్వాల్ ఇద్దరిదీ విభిన్న శైలి: కరోలినా మారీన్

I have to make a new strategy every time I play against Saina Nehwal and PV Sindhu, says Carolina Marin

హైదరాబాద్‌: కొద్ది రోజులుగా నడుము గాయమవడంతో ఆటకు దూరమైన కరోలినా మారీన్ కోలుకుని ఆడేందుకు మళ్లీ సిద్ధమైంది. ప్రపంచంలోనే నాలుగో ప్లేయర్‌గా ఖ్యాతి గడించిన ఈ క్రీడాకారిణి పీవీ సింధు, సైనా నెహ్వాల్‌లపై భారీ ప్రశంసలు కురిపిస్తుంది. వారిద్దరిదీ విభిన్న శైలి అని కొనియాడింది. వాళ్లతో ఆడాల్సి వచ్చిన ప్రతీసారి తాను కొత్త వ్యూహాలతో వస్తానంటూ పేర్కొంది.

Almost at my hundred percent: Carolina Marin ahead of PBL

ప్రీమియర్ బ్యాడ్మింటన్‌ లీగ్‌ (పీబీఎల్‌)లో ఆమె హైదరాబాద్‌ హంటర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. 'సింధు, సైనా ఇద్దరూ బలమైన ప్రత్యర్థులే. వాళ్లు భిన్నమైన క్రీడాకారుణులు. వాళ్లను ఎదుర్కొనే ప్రతీసారీ నేను కొత్త వ్యూహాలతో సిద్ధం కావాల్సివస్తోంది'అని మారీన్‌ తెలిపింది. గాయం కారణంగా కొన్ని నెలల ఆటకు దూరమైన ఆమె ఇటీవలే పునరాగమనం చేసింది.

పీబీఎల్‌లో బాగా రాణించే సత్తా తమ జట్టుకు ఉందని ఆమె చెప్పింది. బ్యాడ్మింటన్‌లో మహిళల సింగిల్స్‌ ఎదుగుదల గురించి మాట్లాడుతూ.. 'మహిళల సింగిల్స్‌ ఇప్పుడు వృద్ధి చెందింది. ఆటగాళ్ల మధ్యలోనూ పోటీ బాగా పెరిగింది. ఎందుకంటే టాప్‌-10లో ఉన్న క్రీడాకారిణులు నైపుణ్య పరంగా దాదాపు సమానులే. ప్రతి ఒక్కరూ ఏ టోర్నీ అయినా గెలవలరు. ఇలాంటి మ్యాచ్‌లో గెలవడం చాలా కష్టం' అని అభిప్రాయపడింది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, December 26, 2017, 14:31 [IST]
Other articles published on Dec 26, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+