For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లిన్‌ డాన్‌పై ప్రణయ్‌ సంచలన విజయం.. ప్రిక్వార్టర్స్‌లో సాయిప్రణీత్‌

HS Prannoy beat big fish Lin Dan in 2019 BWF World Championships

బాసెల్‌: ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత షట్లర్ హెచ్‌.ఎస్‌.ప్రణయ్‌ సంచలన విజయం నమోదు చేసాడు. రెండు సార్లు ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత, ఐదు సార్లు ప్రపంచ ఛాంపియన్‌ లిన్‌ డాన్‌ (చైనా)ను ఓడించి ప్రిక్వార్టర్‌ఫైనల్లోకి దూసుకెళ్లాడు.మరో స్టార్ ఆటగాడు భమిడిపాటి సాయిప్రణీత్‌ కూడా అద్భుత విజయంతో ప్రిక్వార్టర్స్‌ చేరుకున్నాడు.

మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో ప్రణయ్‌ 21-11, 13-21, 21-7తో 11వ సీడ్‌ లిన్‌ డాన్‌ (చైనా)పై విజయం సాధించాడు. 62 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన పోరులో ప్రణయ్‌ గొప్పగా ఆడాడు. తొలి గేమ్‌ నుంచే దూకుడుగా ఆడుతూ 10-5, 19-11తో ఆధిక్యంలోకి వెళ్లి అదే జోరులో గేమ్‌ను గెలిచాడు. అయితే రెండో గేమ్‌లో తడబడ్డ ప్రణయ్‌.. నిర్ణాయక మూడో గేమ్‌లో సత్తా చాటాడు. 6-5తో ఉన్నదశలో ప్రణయ్‌ ఒక్కసారిగా చెలరేగి వరుసగా ఎనిమిది పాయింట్లు గెలిచి 14-5తో ముందంజ వేశాడు. ఆ తర్వాత లిన్‌ డాన్‌కు రెండు పాయింట్లు కోల్పోయిన ప్రణయ్‌.. మరో ఏడు పాయింట్లు సాధించి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు.

తన కెరీర్‌లో లిన్‌ డాన్‌ను మూడోసారి ఓడించిన ప్రణయ్‌.. అతనిపై 3-2తో మెరుగైన రికార్డును నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌కంటే ముందు 2015 ఫ్రెంచ్‌ ఓపెన్‌లో, 2018 ఇండోనేసియా ఓపెన్‌లో లిన్‌ డాన్‌పై ప్రణయ్‌ విజయం సాధించాడు. గతంలో లిన్‌ డాన్‌పై కోచ్ పుల్లెల గోపీచంద్‌ రెండుసార్లు, కిడాంబి శ్రీకాంత్‌ ఒకసారి గెలిచారు. లిన్‌ డాన్‌ను మూడుసార్లు ఓడించిన తొలి భారతీయ ఆటగాడిగా ప్రణయ్‌ రికార్డు నెలకొల్పాడు.

మరో మ్యాచులో సాయి ప్రణీత్‌ 21-16, 21-15తో లీ డాంగ్‌ క్యున్‌ (కొరియా)పై గెలుపొందాడు. పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్లో సుమీత్‌ రెడ్డి- మను అత్రి 21-13, 21-13తో టామ్‌- లాబర్‌ (ఫ్రాన్స్‌)పై విజయం సాధించారు. అరుణ్‌ జార్జ్‌- సాన్యం శుక్లా 18-21, 11-21తో తకుతొ- యుకి (జపాన్‌) చేతిలో ఓడారు. మహిళల డబుల్స్‌ తొలి రౌండ్లో సిక్కిరెడ్డి- అశ్విని పొన్నప్ప జోడీకి వాకోవర్‌ లభించింది. పూజ దండు-సంజన సంతోష్‌ 15-21, 14-21తో యా చింగ్‌- లింగ్‌ ఫాంగ్‌ (చైనీస్‌ తైపీ) చేతిలో ఓడిపోయారు.

Story first published: Wednesday, August 21, 2019, 9:01 [IST]
Other articles published on Aug 21, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+