
హైదరాబాద్: ఊరికే వచ్చెయ్యవు విజయాలనేవి. వాటి వెనక ఎంతో శ్రమ, పట్టుదల, తపన ఉండాల్సిందే. కానీ, ఒక్కసారి గెలిచాక వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ తృప్తే వేరు. అలానే బాడ్మింటన్ క్రీడాకారిణి ఒలంపిక్ వెండి పతక విజేత పీవీ సింధు తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో చిన్న నాటి ఫొటోలను ఉంచింది.అవి తను బాడ్మింటన్ నేర్చకుంటుంటు్ండగా ఉన్నప్పటి ఫొటోలు. అవి ఫోస్ట్ చేయడమే కాక తన స్నేహితుల అభిప్రాయాలను వారి కథలను కూడా పోస్ట్ చేయమని కోరింది.
వాటికి స్పందించిన వారు తమ అభిప్రాయాలను ఇలా పంచుకున్నారు.
నేను బ్యాడ్మింటన్ నేర్చుకోవటం మొదలు పెట్టినప్పుడు నా వయసు ఎనిమిది సంవత్సరాలు. ఆ రోజు నుంచి ఒలంపిక్ వెండి పతకం గెలుచుకునేందత వరకు నా ప్రయాణం చాలా అద్భుతంగాఉంది.
16సంవత్సాల వయస్సులో అకాడమీలో చేరాను. నా చిన్నతనంలో నేను గోపీచంద్ సార్ చేతులమీదుగా అవార్డు క్షణాలు ఇప్పటికీ గుర్తున్నాయ్.
చిన్నతనంలో నాకు ఫుట్‌బాల్ అంటే చాలా ఇష్టం. కానీ, అనుకోకుండా బాడ్మింటన్‌కు మారాను.
నేను బ్యాడ్మింటన్ శిక్షణ ప్రారంభించినప్పుడు రోజూ 100కిలోమీటర్లు ప్రయాణించేదాన్ని. అందుకు తగ్గ ఫలితం దొరికింది. నాకు సాయపడ్డ తల్లిదండ్రులకు, కోచ్‌కు ధన్యవాదాలు