హాంకాంగ్: మోకాలి శస్త్ర చికిత్స తర్వాత తిరిగి పునరాగమనం చేసిన భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ఎట్టకేలకు తొలి విజయం సాధించింది. గత వారంలో ముగిసిన చైనా ఓపెన్ సిరిస్ బ్యాడ్మింటన్ టోర్నీలో నిరాశపర్చిన సైనా హాంకాంగ్ ఓపెన్‌లో సత్తా చాటింది.
చైనా ఓపెన్ నా కల: మాటలు రావడం లేదన్న సింధు
హాంకాంగ్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీలో భాగంగా బుధవారం జరిగిన గేమ్‌లో ఐదో సీడ్‌గా బరిలోకి దిగిన సైనా నెహ్వాల్ థాయ్‌లాండ్ క్రీడాకారిణి పోర్న్‌టిప్‌కు మధ్య జరిగిన గేమ్‌లో 12-21, 21-19, 21-17 స్కోరుతో విజయం సాధించింది. కాగా రియో ఒలింపిక్స్ అనంతరం సైనా నెహ్వాల్ మోకాలి శస్త్ర చికిత్స జరిగిన సంగతి తెలిసిందే.

ఆమె కోలుకున్న తర్వాత తొలిసారి పాల్గొన్న చైనా ఓపెన్ టోర్నీ తొలి రౌండ్‌లోనే పొర్న్‌టిప్ చేతిలో సైనా ఓటమి పాలవ్వడం గమనార్హం. తన ఫిట్‌నెస్ లెవెల్స్ గురించి సంతృప్తికరంగా ఉన్నానని, రాబోయే రోజుల్లో తిరిగి అత్యుత్తమ ప్రదర్శనను కనబరుస్తానని చైనా ఓపెన్ తొలి రౌండ్ ఓటమి అనంతరం సైనా చెప్పింది.
ట్విట్టర్‌లో అభినందనలు: సింధుకి ప్రైజ్ మనీ ఎంత?
ఇదిలా ఉంటే అదే చైనా ఓపెన్ టైటిల్‌ను రియో ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక, దుబాయి ఓపెన్ సిరిస్ ఫైనల్‌లో చోటు దక్కించుకోవాలంటే సైనా వరుసగా విజయాలను సాధించాల్సి ఉంటుంది. హాంకాంగ్ పురుషుల సింగిల్స్‌లో స్విస్ ఓపెన్ విజేత హెచ్‌ఎస్ ప్రణయ్ 21-16, 21-18 తేడాతో క్వియావో బిన్ (చైనా)ను విజయం సాధించాడు.