న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

'మరో సూపర్ సిరీస్‌కు సిద్ధమైన భారత షట్లర్లు'

Hong Kong Open: PV Sindhu to spearhead Indian challenge, tough draw for Saina Nehwal

హైదరాబాద్: ఈ ఏడాది ఒక్క సూపర్‌ సిరీస్‌ టైటిల్‌ కూడా కొట్టని భారత స్టార్‌ షట్లర్లు మరో టోర్నీకి సిద్ధమయ్యారు. హైదరాబాద్ స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ సహా.. భారత ఆటగాళ్లు సింధు, శ్రీకాంత్ హాంకాంగ్ ఓపెన్ బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్ బరిలోకి దిగుతున్నారు. ఈ ఏడాది 11 సూపర్‌ సిరీస్‌లలో బరిలో దిగిన సింధు.. ఇండియా ఓపెన్‌, థాయ్‌లాండ్‌ ఓపెన్‌లలో మాత్రమే ఫైనల్‌ చేరింది.

జిందాపోల్‌‌తో సింధు :

జిందాపోల్‌‌తో సింధు :

థాయిలాండ్‌కు చెందిన జిందాపోల్‌తో సింధు...తొలిరౌండ్‌లో అమీతుమీ తేల్చుకోనుంది. సింధుకు క్వార్టర్స్‌లో బింగ్జియావో రూపంలో పెను ప్రమాదం ఎదురవనుంది. మంగళవారం నుంచే హాంకాంగ్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 500 టోర్నమెంట్‌. మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్లో జిందాపోల్‌ (థాయ్‌లాండ్‌)తో సింధు తలపడనుంది.

సూపర్‌ సిరీస్‌ లక్ష్యాన్ని మాత్రం ఛేదించలేక

సూపర్‌ సిరీస్‌ లక్ష్యాన్ని మాత్రం ఛేదించలేక

రెండో సీడ్‌ యమగూచితో తలపడనున్న సైనా.. గాయంతో 2017లో ఎక్కువగా విశ్రాంతికే పరిమితమైంది. 2018లో కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణం, ఆసియా క్రీడల్లో కాంస్యం, ఆసియా ఛాంపియన్‌షిప్‌లో కాంస్యంతో మెరిసింది. ఐతే సూపర్‌ సిరీస్‌ లక్ష్యాన్ని మాత్రం ఛేదించలేకపోయింది. మూడు సార్లు విజేతగా నిలిచిన ఇండోనేసియా మాస్టర్స్‌లో ఫైనల్‌ చేరినా ఫలితం లేకపోయింది.

తొలి రౌండ్లో శ్రీకాంత్‌.. వోంగ్‌ వింగ్‌‌కిను

తొలి రౌండ్లో శ్రీకాంత్‌.. వోంగ్‌ వింగ్‌‌కిను

పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్లో కిదాంబి శ్రీకాంత్‌.. హాంకాంగ్‌కు చెందిన వోంగ్‌ వింగ్‌‌కి విన్సెంట్‌ను ఢీకొట్టనున్నాడు. గతేడాది జాతీయ సీనియర్‌ ఛాంపియన్‌షిప్‌లో గాయం శ్రీకాంత్‌ను వెనక్కి నెట్టింది. అప్పట్నుంచి ఆటలో వెనుకబడిన శ్రీకాంత్‌.. ఇప్పటి వరకు కోలుకోలేదు. కామన్వెల్త్‌ క్రీడల్లో రజతం మినహాయిస్తే శ్రీకాంత్‌ తరఫున ఈ ఏడాది రాణించిందే లేదు.

ప్రణయ్ తొలిరౌండ్ అధిగమిస్తే

ప్రణయ్ తొలిరౌండ్ అధిగమిస్తే

భారత్‌కే చెందిన హెచ్‌ఎస్ ప్రణయ్ తొలిరౌండ్ అడ్డంకిని అధిగమిస్తే శ్రీకాంత్‌తో తలపడాల్సి ఉంటుంది. ప్రణయ్‌, సమీర్‌, సాయిప్రణీత్‌ కూడా బరిలో ఉన్నారు. సాత్విక్‌ సాయిరాజ్‌ పురుషుల, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో పోటీ పడనున్నాడు. మహిళల డబుల్స్‌లో సిక్కి, పురుషుల డబుల్స్‌లో సుమీత్‌ బరిలో ఉన్నారు.

Story first published: Tuesday, November 13, 2018, 12:20 [IST]
Other articles published on Nov 13, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X