Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హాంకాంగ్‌ ఓపెన్‌.. సెమీస్‌లో ఓడిన శ్రీకాంత్

Hong Kong Open: Kidambi Srikanth lost to Hong Kongs Lee Cheuk Yiu in the semi-final

హాంకాంగ్‌: బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-500 హాంకాంగ్ ఓపెన్ సెమీఫైనల్లో భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ పరాజయం పాలయ్యాడు. శనివారం జరిగిన సెమీస్‌లో శ్రీకాంత్ 9-21, 23-25తో లీ చెక్ యూ (హాంకాంగ్) చేతిలో ఓడిపోయాడు. 42 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్‌ అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు.

తొలి గేమ్‌లో ఆకట్టుకోలేకపోయిన శ్రీకాంత్ రెండో గేమ్‌లో సత్తా చాటాడు. ఓ దశలో 20-15తో ఐదు గేమ్‌ పాయింట్లను సంపాదించాడు. మరో పాయింట్‌ గెలిస్తే మ్యాచ్‌లో నిలిచే స్థితిలో.. తీవ్ర ఒత్తిడికి లోనైన శ్రీకాంత్‌ వరుసగా ఐదు పాయింట్లు చేజార్చుకున్నాడు. దీంతో స్కోరు 20-20తో సమం అయింది. ఈ సమయంలో శ్రీకాంత్‌ మళ్లీ పాయింట్‌ గెలిచి 21-20తో ఆధిక్యంలోకి వెళ్లాడు. 21-21తో స్కోరు మళ్లీ సమమయ్యాక శ్రీకాంత్‌ మరో పాయింట్‌ గెలిచి 22-21తో ఏడోసారి గేమ్‌ పాయింట్‌ సంపాదించాడు.

లీ చెయుక్‌ పట్టుదలతో పోరాడి స్కోరును 22-22తో, ఆ తర్వాత 23-23తో సమం చేశాడు. ఈ దశలో లీ చెయుక్‌ వరుసగా రెండు పాయింట్లు గెలిచి గేమ్‌తో పాటు మ్యాచ్‌నూ సొంతం చేసుకొని ఫైనల్‌కు దూసుకెళ్లాడు. బరిలో నిలిచిన మిగిలిన ప్లేయర్లంతా వెనుదిరగడంతో హాంకాంగ్ ఓపెన్‌లో భారత్ పోరాటం ముగిసినైట్లెంది.

తొలి రౌండ్‌లో ప్రపంచ చాంపియన్‌ కెంటో మొమోటా (జపాన్‌) నుంచి వాకోవర్‌ లభించిన విషయం తెలిసిందే. ఇక కీలక క్వార్టర్‌ ఫైనల్లో రియో ఒలింపిక్స్‌ చాంపియన్‌ చెన్‌ లాంగ్‌ (చైనా) గాయంతో వైదొలగడం కూడా కలిసొచ్చింది. అయితే ఎనిమిది నెలల తర్వాత ఓ టోర్నీ లో సెమీఫైనల్‌ చేరే అవకాశం దక్కించుకున్న శ్రీకాంత్‌.. ఆ అడ్డంకిని మాత్రం దాటలేకపోయాడు.

Story first published: Sunday, November 17, 2019, 11:23 [IST]
Other articles published on Nov 17, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+