బాయ్‌కు షాక్: హైకోర్టులో జ్వాలా గుత్తాకు ఊరట
న్యూఢిల్లీ: బాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాలా గుత్తాకు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. అంతర్జాతీయ పోటీల్లో ఆడడానికి జ్వాలా గుత్తాను అనుమతించాలని హైకోర్టు భారత బాడ్మింటన్ సంఘాన్ని (బాయ్‌ని) ఆదేశించింది. దీంతో బాయ్‌కు ఎదురు దెబ్బ తగిలినట్లే.
ఇండియన్ బాడ్మింటన్ లీగ్ (ఐబియల్)లో క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడిందనే ఆరోపణలపై అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనకుండా బాయ్ ఆమెపై ఆంక్షలు విధించింది. ఆ నిర్ణయాన్ని జ్వాలా గుత్తా బుధవారం కోర్టుకు ఎక్కింది. తనపై జీవిత కాలం నిషేధం విధించాలనే బాయ్ నిర్ణయాన్ని ఆమె సవాల్ చేసింది.

ఐబియల్ వివాదంపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో నెల రోజుల పాటు ఆమెపై తొలుత నెల రోజుల పాటు నిషేధం విధించింది. దీంతో అశ్విని పొన్నప్పతో జత కట్టి డెన్మార్క్ ఓపెన్ టోర్నమెంటులో ఆడే అవకాశం ఉంది.
జ్వాలా గుత్తా, పొన్నప్ప విజయవంతమైన భారత డబుల్స్ జోడీగా పేరు గాంచింది. ఒలింపిక్స్ తర్వాత వారిద్దరు విడిపోయారు. తిరిగి ఇప్పుడు వారు జత కట్టబోతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications