భార్య గర్భవతి: నటితో సూపర్ స్టార్ రాసలీలలు
ముంబై: చైనా టాప్ అథ్లెట్, బ్యాడ్మింటన్ సూపర్ స్టార్ లిన్ డాన్ బహిరంగ క్షమాపణ కోరాడు. తన భార్య గర్భవతిగా ఉన్నప్పుడు వేరొక మహిళతో సహజీవనం చేశానని అతడు అంగీకరించడం సంచలనం రేపుతోంది. వివరాల్లోకి వెళితే లిన్ డాన్ భార్య ఇటీవలే తొలి బిడ్డకు జన్మనిచ్చింది.
తన భార్య గర్భవతిగా ఉన్న సమయంలో ఓ 'మిస్టరీ మహిళ'తో లిన్ డాన్ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్న ఫొటోలు ఆన్‌లైన్‌లో వెలుగులోకి వచ్చాయి. 'డిటెక్టివ్ ఝావో' పేరుతో ఆన్‌లైన్‌లో పోస్టుచేసిన ఈ ఫొటోలు లిన్ డాన్ అభిమానుల్ని షాక్‌కు గురిచేశాయి. లిన్‌తో తిరిగిన సదరు మహిళ ప్రముఖ మోడల్, నటి ఝావో యాకిగా గుర్తించారు.

నటి ఝావో యాకితో లిన్ రాసలీలలు
గత సెప్టెంబర్ నెలలో ఓ రెస్టారెంట్ వద్ద లిన్, యాకీ సన్నిహితంగా తిరుగుతుంటే ‘డిటెక్టివ్ ఝావో' గమనించి వారిని అనుసరించాడు. ఆ సమయంలో లిన్ డాన్... యాకీని తన ఇంటికి తీసుకెళ్లాడని, రెండుగంటలు గడిపిన అనంతరం వారు బయటకు వచ్చారు. ఆ తర్వాత వారు ఓ హోటల్‌లో కూడా రాసలీలలు నెరిపారని డిటెక్టివ్ ఝావో తన బ్లాగులో పేర్కొన్నాడు.

ఆన్‌లైన్‌లో హల్ చల్ చేస్తున్న ఫోటోలు
ఇప్పుడు ఈ ఫోటోలు ఆన్‌లైన్‌లో హల్ చల్ చేస్తున్నాయి. ఇక లిన్ డాన్ భార్య గ్జీ జింగ్‌ఫంగ్ కూడా బ్యాడ్మింటన్ ఛాంపియన్ కావడం విశేషం. రెండు సార్లు వరల్డ్ బ్యాడ్మింటిన్ ఛాంపియన్ షిప్ గెలుపొందిన ఆమె నవంబర్ 5న బిడ్డను ప్రసవించింది. ఈ నేపథ్యంలో లిన్, యాకీ రాసలీలల ఫోటోలు ఆన్‌లైన్‌లో రావడంతో చైనా సోషల్ మీడియా వెబ్‌సైట్ వీబోలో లిన్ తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు.

యాకీతో ఫోటోలపై లిన్ డాన్ స్పందన
ఈ ఫోటోలపై లిన్ డాన్ తన మైక్రో బ్లాగులో స్పందించాడు. 'ఒక వ్యక్తిగా నా తప్పులకు సాకులు వెతుక్కోను. నా ప్రవర్తన కుటుంబాన్ని గాయపరిచింది. అందుకే నా కుటుంబానికి క్షమాపణలు చెప్తున్నా' అని ఆయన బహిరంగ క్షమాపణ కోరాడు.

ఐదుసార్లు బ్యాడ్మింటన్ ప్రపంచ చాపింయన్
ఇదిలా ఉంటే 33 ఏళ్ల లిన్ డాన్ ఐదుసార్లు బ్యాడ్మింటన్ ప్రపంచ చాపింయన్‌గా నిలిచాడు. రెండుసార్లు ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ సాధించాడు. అభిమానులు ముద్దుగా లిన్ డాన్‌ను 'సూపర్ డాన్' అని పిలుచుకుంటారు. ప్రస్తుత బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో మూడో స్ధానంలో కొనసాగుతున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications