ఈ ఏడాది అద్భుతం: అదే అసలైన సవాల్ అన్న సింధు
హైదరాబాద్: ఈ ఏడాది తనకు అద్భుతంగా గడిచిందని రియో ఒలింపిక్స్ పతక విజేత, స్టార్ షట్లర్ పీవీ సింధు చెప్పింది. ప్రస్తుతం తన దృష్టంతా ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నెంబర్‌వన్ ర్యాంకు సాధించడంపైనే ఉందని తెలిపింది.
'ఈ ఏడాది నా కెరీర్ అద్భుతంగా సాగింది. ఒలింపిక్స్‌లో పతకం సాధించడం అతిపెద్ద విజయం. కెరీర్‌లో ఉన్నత స్థాయికి చేరుకోవడం వరకు సరే. కానీ దాన్ని నిలబెట్టుకోవడమే అసలైన సవాల్' అని సింధు తెలిపింది.

ప్రపంచ నెంబర్‌వన్ ర్యాంకే నా లక్ష్యం
'నేను చాలా కష్టపడాలి. ఇక ప్రపంచ నెంబర్‌వన్ ర్యాంకే నా లక్ష్యం. నా కెరీర్ అత్యుత్తమ ర్యాంకు 6. భవిష్యత్తులో మరింత మెరుగైన ప్రదర్శన కనబరుస్తా. రియో ఒలింపిక్స్‌తో నా కల నిజమైంది. రియో ఒలింపిక్స్ తర్వాత నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. అదే విధంగా సూపర్‌సిరీస్ టైటిల్ నెగ్గాలనుకున్నాను. చైనా ఓపెన్‌తో దానిని నెరవేర్చుకున్నా. అందుకు చాలా సంతోషంగా ఉన్నా' అని పేర్కొంది.

రాబోయే రోజుల్లో నిలకడగా రాణించాలి
ఇక రాబోయే రోజుల్లో నిలకడగా రాణించాలని కోరుకుంటున్నానని ఓ ప్రమోషనల్ ఈవెంట్‌లో పాల్గొన్న సందర్భంగా సింధు చెప్పింది. రియో ఒలింపిక్స్ అనంతరం తన ఆలోచన విధానంలో మార్పులు చోటు చేసుకున్నాయని సింధు పేర్కొంది.

పుల్లెల గోపీచందే కారణం
కోచ్ పుల్లెల గోపీచంద్ సూచనల ప్రకారం తీవ్రంగా సాధన చేశానని, ప్రతిమ్యాచ్‌కి ప్రణాళికలను మార్చుకున్నాని తెలిపింది. మరో ఆటగాడు కిదాంబి శ్రీకాంత్ మాట్లాడుతూ తాను ఈస్థాయిలో ఉండటానికి జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ పుల్లెల గోపీచంద్ కారణమని చెప్పాడు.

బ్యాడ్మింటన్ ఉన్నత స్థాయికి చేరుకుంది
గోపీచంద్ వల్లే మన దేశంలో బ్యాడ్మింటన్ ఉన్నత స్థాయికి చేరుకుందని, అతనొక్కడే 20 మంది చైనా, కొరియా కోచ్‌లతో సమానమని చెప్పాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications