హైదరాబాద్: ఈ మధ్య కాలంలో సెలబ్రిటీటల సెల్ఫీలపై సోషల్ మీడీయాలో నెగిటివ్ ప్రచారం ఎక్కువగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా వారి వస్త్రధారణ విషయంలో హీరోయిన్లు, క్రీడాకారిణిలు శృతి మించుతున్నారంటూ నెటిజన్లు విరుచుపడిన సంగతి తెలిసిందే.
ఇదే అనుభవాన్ని భారత మహిళా కెప్టెన్ మిథాలీ రాజ్ ఎదుర్కొన్నారు. అయితే ఎవరేమనుకున్నా... ఇలాంటి వాటిని తాను లెక్కచేయనని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల స్పష్టం చేశారు. 'ద్వేషించేవాళ్లు ద్వేషించినా కానీ, ముందు నన్నో సెల్ఫీ దిగనివ్వండి' అంటూ ఓ ఫోటోను తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
మిమ్మల్ని మీరు ప్రేమించండి. ట్రోలర్స్ గురించి పట్టించుకోకండి. పాజిటివిటీ, ప్రేమని పంచండి అంటూ హ్యాష్ ట్యాగ్‌లు పెట్టి మరీ గుత్తా జ్వాలా ట్వీట్ చేయడం విశేషం.