Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సన్మానం: ప్రభుత్వ ప్రోత్సాహంతో రాణిస్తామన్న జ్వాల

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం క్రీడలను క్రీడలను ప్రోత్సహిస్తోందని.. తాము మరింత రాణిస్తామని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల అన్నారు. శుక్రవారం తెలంగాణ మంత్రి పద్మారావు ఆమెను సన్మానించారు. ఈ సందర్భంగా పద్మారావు మాట్లాడుతూ.. క్రీడాకారులకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

ఇటీవల కెనడా ఓపెన్ డబుల్స్ గెలిచిన గుత్తా జ్వాల తమకు ప్రభుత్వం నుంచి సరైన గుర్తింపు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆమె గత బుధవారం మాట్లాడుతూ.. ఇకనైన ప్రభుత్వం తమను పట్టించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

డబుల్స్ స్పెషలిస్ట్ షట్లర్లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సింగిల్స్ ప్లేయర్ల మాదిరిగానే తమకూ తగిన సాయం అందించాలని డిమాండ్ చేశారు. ఎన్నో ఏళ్లుగా సేవ చేస్తున్నా తమకు గుర్తింపు లభించడం లేదన్నారు. ప్రభుత్వం నుంచి తమకు ఏనాడూ తగిన సాయం అందలేదని చెప్పారు.

Gutta Jwala honored by Telangana Government

ప్రయివేట్ కోచ్‌ల సాయంతో తాను, అశ్వినిలం ఇంతదూరం వచ్చామన్నారు. డబుల్స్‌లో అశ్విని, తాను ఉత్తమ జోడి అన్నారు. అయినప్పటికీ టార్గెట్ ఒలింపిక్ స్టేడియం (టాప్)లో చేర్చక పోవడం దారుణమన్నారు.

ఇప్పుడైనా తమ గురించి ప్రభుత్వం ఆలోచించాలన్నారు. తమకు అగ్రశ్రేణి క్రీడాకారులకు లభించే ప్రోత్సాహం కావాలన్నారు. తాము తప్పకుండా ఒలింపిక్స్‌లో పతకం నెగ్గుతామన్నారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:11 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+