సైనాకు సువర్ణావకాశం, ఆల్ ఇంగ్లండ్ గెలుస్తుంది!: మాజీ కోచ్ విమల్

హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ మానసికంగా చాలా దృఢమైన షట్లర్ అని ఆమె మాజీ కోచ్ విమల్ కుమార్ కితాబిచ్చారు. ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లాండ్ టోర్నమెంట్ గెలవడానికి ఈ ఏడాది సైనా నెహ్వాల్‌కు మంచి అవకాశం ఉందని భారత మాజీ ఆటగాడు విమల్ కుమార్ అన్నాడు.
తాజాగా ఇండోనేసియా మాస్టర్స్ టోర్నీ గెలిచిన సైనా.. శారీరకంగానే కాక మానసికంగా ఫిట్‌గా ఉందని చెప్పాడు. సైనా అంతటి మానసికంగా చాలా దృఢమైన షట్లర్ భారత్‌లో మరొకరు లేరని అన్నాడు. ప్రపంచ టాప్ స్టార్లు తై జు యింగ్ (చైనీస్ తైపీ), కరోలినా మారిన్ (స్పెయిన్)లు గాయాలతో సతమతమవుతున్నారని అన్నాడు.

సైనా మానసికంగా చాలా కఠినమైది
పీటీఐకి ఇచ్చిన ఇంటర్యూలో "సైనా మానసికంగా చాలా కఠినమైది. ఈ విషయంలో ఆమె చాలామంది పురుషుల కన్నా మెరుగైందని చెప్పగలను. ఇప్పుడు దేశంలో ఉన్న షట్లర్ల అందరికంటే చాలా దృఢంగా ఉంటుంది. కోర్టులో దిగిన తర్వాత ఏ విషయం గురించి ఆమె పట్టించుకోదు. తన ఆటతో ప్రత్యర్థులను ఇబ్బందులకు గురి చేస్తుంది" అని విమల్ పేర్కొన్నాడు.

సైనాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది
"తాజా ఇండోనేసియా టైటిల్ విజయం సైనాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఇది ఆల్ ఇంగ్లండ్‌లో ఉపయోగపడుతుంది. తప్పకుండా ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిపే ఆమె లక్ష్యం కావాలి. మారిన్ కోలుకునేందుకు కనీసం ఐదారు నెలల సమయం పడుతుంది. తై జు యింగ్ ఇప్పటికే గాయంతో ఆటకు దూరమైంది. కాబట్టి సింధు, సైనాకు టైటిల్‌ను గెలిచేందుకు ఇదో గొప్ప అవకాశం" అని అన్నాడు.

మరింత మెరుగ్గా ప్రాక్టీస్ చేయాలి
"వయసు రీత్యా సైనా ఇదే ఫామ్‌ను కొనసాగించేందుకు సైనా మరింత మెరుగ్గా ప్రాక్టీస్ చేయాలి. అదే సమయంలో గాయాలు కాకుండా చూసుకోవాలి. ఒలింపిక్స్‌కు కూడా సమయం దగ్గరపడుతున్నది. ఫిట్‌నెస్, ఆటను కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఇప్పటికిప్పుడు ఆల్ ఇంగ్లాండ్ గెలువడమే ఆమె ముందున్న లక్ష్యం" అని విమల్ చెప్పుకొచ్చాడు. విమల్ కుమార్ 2014 నుంచి 2017 వరకు ఆమెకు కోచ్‌గా పని చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications