Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సైనా, సింధులకు వేర్వేరు చోట్ల శిక్షణ, మళ్లీ అదే పదవిలో కేటీఆర్

Gopichand training Saina, Sindhu at separate venues

హైదరాబాద్: ఇటీవలి కామన్ వెల్త్ గేమ్స్ లో పతకదారులుగా నిలిచిన తెలుగు తేజాలు పీవీ సింధు, సైనా నెహ్వాల్‌లకు రెండు వేర్వేరు అకాడమీల్లో శిక్షణ ఇస్తున్నాడు గోపీచంద్. ఇద్దరూ హేమాహేమీలుగా ఒకానొక సందర్భంలో ప్రత్యర్థులుగానూ ఆడాల్సి వస్తున్న తరుణంలో ఇలా నిర్ణయం తీసుకున్నాడు కోచ్ పుల్లెల గోపీచంద్ నిర్ణయించుకున్నారు. సోమవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న గోపీచంద్, ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు.

Gopichand Training Saina And Sindhu at Separate Venues

గతంలో తాను వేర్వేరు షెడ్యూల్స్ లో ఇద్దరికీ శిక్షణ ఇచ్చానని, ప్రస్తుతం కోచింగ్ జట్టు సమష్టిగా తీసుకున్న నిర్ణయం మేరకు వేర్వేరుగా శిక్షణ ఇస్తున్నానని వెల్లడించారు. ఈ రెండు శిక్షణా కేంద్రాల మధ్య దూరం అర కిలోమీటర్ వరకూ ఉంటుందని ఇద్దరూ బాగా ప్రాక్టీస్ చేస్తున్నారని, ఇద్దరికీ చాలినంత సమయాన్ని తాను కేటాయిస్తున్నానని అన్నారు.

ఇదిలా ఉంచితే, తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం (బ్యాట్) అధ్యక్షుడిగా రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు, ప్రధాన కార్యదర్శిగా భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ నాలుగేళ్ల పదవీకాలానికి మళ్లీ ఎన్నికయ్యారు. శనివారం గచ్చిబౌలిలో జరిగిన సర్వసభ్య సమావేశం సందర్భంగా కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోవడంతో.. కేటీఆర్ ఈ పదవికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

2018 నుంచి 2022వరకు కొత్త కార్యవర్గం పదవీ బాధ్యతలు నిర్వహించనుంది. సంఘం ఉపాధ్యక్షులుగా వై ఉపేందర్‌రావు, చాముండేశ్వర్‌నాథ్, ఏ రామారావు,పీ రమేశ్‌రెడ్డి, జీ వెంకట్రావు వ్యవహరించనుండగా..కోశాధికారిగా కే.ఫణిరావు, సలహాదారుగా కే శ్రీనివాస్ ఎన్నికయ్యారు.

Story first published: Tuesday, June 5, 2018, 14:01 [IST]
Other articles published on Jun 5, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+