సింధు ఇలా: సైనాపై గోపీచంద్ నో కామెంట్(పిక్చర్స్)
హైదరాబాద్: ప్రపంచ చాంపియన్‌షిప్‌లో క్యాంస్య పతకాన్ని సాధించడం ఎంతో ఆనందంగా ఉందని యువ షట్లర్ పివి సింధు తెలిపింది. తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని భవిష్యత్‌లో మెరుగ్గా రాణిస్తానని చెప్పింది. పతకం సాధించి డెన్మార్క్ నుంచి తిరిగివచ్చిన సందర్భంగా గచ్చిబౌలిలోని గోపీచంద్ అకాడమీలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో సింధు మాట్లాడింది. తన ప్రత్యర్థి కరోలినా మారిన్ అద్భుతంగా ఆడిందని ప్రశంసించింది.
సింధు మరింత నిలకడగా రాణించాల్సిన అవసరం ఉందని జాతీయ బాడ్మింటన్ కోచ్ గోపీచంద్ అన్నాడు. ఫిట్నెస్‌పై శ్రద్ధ పెడుతున్నట్టు చెప్పాడు. ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో వరుసగా రెండుసార్ల పతకాలు గెల్చుకోవడం అద్భుతమని సింధుని ప్రశంసించాడు. అదే సమయంలో నిలకడగా ఆడుతూ మరిన్ని విజయాలు సాధించాలని సింధుకు సూచించాడు.
సైనా నెహ్వాల్ బెంగళూరుకు వెళ్లి జాతీయ మాజీ కోచ్ విమల్ కుమార్ వద్ద శిక్షణ పొందాలని నిర్ణయించుకోవడంపై స్పందించాడానికి గోపీచంద్ నిరాకరించాడు. తనకు ఈ విషయంపై పూర్తి అవగాహన లేదన్నాడు. ఆసియా క్రీడలు సమీపిస్తున్న కారణంగా దీనిపై తాను మాట్లాడలేనని చెప్పాడు.

తప్పుల వల్లే ఇలా..
తాను చేసిన చేసిన తప్పుల వల్లే సెమీస్‌లో ఓడిపోయానని, తన స్థాయికి తగ్గట్లు ఆడలేదని అందరూ చెప్పారని, భవిష్యత్‌లో పొరబాట్లకు తావివ్వనని చెప్పింది.

పాఠాలు నేర్చుకుంటున్నా..
మ్యాచ్‌లు ఆడుతున్నప్పుడు చేసిన పొరపాట్లు నుంచి పాఠాలు నేర్చుకుంటున్నానని ప్రపంచ బాడ్మింటన్ చాంపియన్‌షిప్స్‌లో కాంస్య పతకాన్ని సాధించిన హైదరాబాదీ పివి సింధు చెప్పింది.

తప్పిదాలతోనే పాఠాలు..
తప్పిదాలే ఎన్నో పాఠాలు నేర్పుతాయని పివి చెప్పింది. నూటికి నూరు శాతం రాణించడం ఎవరికైనా అసాధ్యమని సింధు వ్యాఖ్యానించింది.

కలిసే సాగుతాయి..
విజయాలు, పరాజయాలు కలిసి సాగుతాయని సింధు చెప్పింది. సెమీ ఫైనల్స్‌లో తాను మరింత మెరుగ్గా రాణించి ఉండేదానినని, కానీ, కొన్ని చిన్నచిన్న పొరపాట్లే మ్యాచ్ ఫలితాన్ని నిర్దేశించాయని చెప్పింది.

గోపీచంద్ ప్రశంసలు..
19 ఏళ్ల వయసులో ఎన్నో అంతర్జాతీయ టైటిళ్లను అందుకున్న సింధుకు మంచి భవిష్యత్తు ఉందని గోపీచంద్ అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications