కెసిఆర్‌తో గోపి, సింధు: కెటిఆర్, కవిత తోడు (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతో గత రెండు రోజులుగా క్రీడాకారులు భేటీ కావడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. రాష్ట్రానికి చెందిన వివిధ క్రీడాకారులు ముఖ్యమంత్రిని కలుస్తున్నారు. తాజాగా, శనివారంనాడు బ్యాడ్మింటన్ కోచ్ గోపీచంద్, క్రీడాకారిణి పివి సింధు కెసిఆర్‌ను కలిశారు.
క్రీడాకారులను ముఖ్యమంత్రి బాగా ప్రోత్సహిస్తున్నారని, కాంస్య పతకం గెలిచిననందుకు కెసిఆర్ తనను అభినందించారని సింధు భేటీ తర్వాత మీడియాతో చెప్పారు. ఆసియా క్రీడల్లో రాణించాలని కెసిఆర్ తనకు సూచించినట్లు ఆమె తెలిపారు.
క్రీడాకారులకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మంచి ప్రోత్సాహం ఇస్తున్నారని గోపీచంద్ అన్నారు. ఈ భేటీలో మంత్రి, కెసిఆర్ తనయుడు కెటి రామారావు, పార్లమెంటు సభ్యురాలు, కెసిఆర్ కూతురు కల్వకుంట్ల కవిత కూడా పాల్గొన్నారు.

కెసిఆర్‌తో గోపీచంద్, సింధు ఇలా...
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్, క్రీడాకారిణి పివి సింధు శుక్రవారంనాడు కలిశారు.

కెసిఆర్‌తో గోపీచంద్, సింధు ఇలా..
ముఖ్యమంత్రి కెసిఆర్‌ను గోపీచంద్, పివి సింధు శుక్రవారంనాడు కలిశారు. వారితో పాటు కెటిఆర్, కల్వకుంట్ల కవిత, ఎంపి జితేందర్ రెడ్డి కూడా ఉన్నారు.

కెసిఆర్‌తో గోపిచంద్, సింధు ఇలా...
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును గోపిచంద్, పివి సింధు కలిశారు. ఈ సందర్భంగా కెసిఆర్ సింధును సన్మానించారు.

కెసిఆర్ కాన్వాయ్...
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కాన్వాయ్ వాహనాల రంగు మారింది. ఆ వాహనాలు ఇలా సచివాలయంలో కనిపించాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications