Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సాత్విక్-చిరాగ్ జోడీదే ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్

భారత స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజు, చిరాగ్ శెట్టి మరోసారి సంచలన ప్రదర్శన చేశారు. మరికొన్ని నెలల్లో ఒలింపిక్స్ జరిగే పారిస్ గడ్డపై తమ రాకెట్లతో దూసుకెళ్లారు. ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో మెన్స్ డబుల్స్ విభాగంలో విజేతగా నిలిచారు. ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గడం ఈ జోడీకి ఇది రెండోసారి కావడం విశేషం.

ఆదివారం చైనీస్ తైపీ జంట లీ జి హుయ్- యాంగ్ పొ సువాన్‌తో జరిగిన ఫైనల్‌లో సాత్విక్-చిరాగ్ జోడీ 21-11, 21-17తో వరుస గేమ్స్‌లో గెలిచి ఈ ఘనత సాధించారు.తుదిపోరును మన బ్యాడ్మింటన్ స్టార్లు కేవలం 37 నిమిషాల్లోనే పూర్తిచేశారు. తొలి గేమ్‌లో 15 నిమిషాల్లోనే ప్రత్యర్థిని చిత్తుగా ఓడించారు. తొలుత 4-4తో స్కోరుగా సమంగా ఉండటంతో హోరాహోరీ పోరుగా సాగుతుందనుకుంటే వన్‌సైడ్‌‌గా మారింది. సాత్విక్-చిరాగ్ అద్భుత ఆటతో ప్రత్యర్థిని బెంబేలెత్తించారు.

French Open Super 750 Satwiksairaj Rankireddy-Chirag Shetty win Men s doubles title

రెండో గేమ్‌లో చైనీస్ తైపీ జంట అంత ఈజీగా ఓటమిని అంగీకరించలేదు. ప్రపంచ నంబర్ వన్ అయిన మన జోడీపై పైచేయి సాధించడానికి తీవ్రంగా ప్రయత్నించారు. కానీ సాత్విక్, చిరాగ్ స్మాష్‌లు, క్రాస్‌ కోర్టు షాట్లతో రెండో సారి ఫ్రెంచ్ ఓపెన్‌ను కైవసం చేసుకున్నారు. సాత్విక్‌-చిరాగ్ జోడీ 2022లోనూ ఫ్రెంచ్ ఓపెన్‌ను గెలిచిన సంగతి తెలిసిందే. 2019లో రన్నరప్‌గా నిలిచారు.

ఓవరాల్‌గా సాత్విక్-చిరాగ్ జోడీకి ఇది రెండో సూపర్ 750 టైటిల్. అలాగే సూపర్ 300 లేదా ఆపై స్థాయి హొదా ఉన్న ఏడో వరల్డ్ టూర్ టైటిల్. ఇక ఈ ఫ్రెంచ్ ఓపెన్‌లో పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో చైనా షట్లర్‌ షి యుకీ విజేతగా నిలిచాడు. థాయ్‌లాండ్ స్టార్ కున్లావుట్‌‌పై 22-20, 21-19 తేడాతో గెలిచాడు. మహిళల సింగిల్స్‌లో దక్షిణ కొరియా షట్లర్ అన్‌ సె యంగ్‌ ఛాంపియన్‌గా నిలిచింది.

Story first published: Monday, March 11, 2024, 9:25 [IST]
Other articles published on Mar 11, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+