న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫ్రెంచ్‌ ఓపెన్‌.. ఫైనల్లో సాత్విక్‌, చిరాగ్‌ జంట ఓటమి

French Open: Satwik-Chirag finish men’s doubles runners-up after losing final to Sukamuljo-Fernaldi

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌ పురుషుల డబుల్స్‌ ఫైనల్లో భారత షట్లర్లు సాత్విక్ సాయిరాజ్ రాంకీరెడ్డి-చిరాగ్ శెట్టి జోడీ ఓడిపోయింది. ఆదివారం జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో ఇండోనేషియా ఆటగాళ్లు, ప్రపంచ నంబర్‌వన్‌ జోడీ మార్కస్‌ ఫెర్ణాల్డి, కెవిన్‌ సంజయ సుకముల్జో చేతిలో 18-21, 16-21 తేడాతో సాత్విక్‌, చిరాగ్‌ల జోడీ ఓటమిని చవిచూసింది. దీంతో సాత్విక్‌, చిరాగ్‌ల జోడీ రన్నరప్‌గా నిలిచింది.

Australia vs Sri Lanka: టీ20లో లంక బౌలర్ చెత్త రికార్డు.. 4 ఓవర్లలో 75 పరుగులుAustralia vs Sri Lanka: టీ20లో లంక బౌలర్ చెత్త రికార్డు.. 4 ఓవర్లలో 75 పరుగులు

1983లో చివరిసారి భారత పురుషుల డబుల్స్‌ జోడీ పార్తో గంగూలీ, విక్రమ్‌ సింగ్‌లు ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ గెలిచారు. ఇప్పుడు సాత్విక్‌, చిరాగ్‌ల జోడీ టైటిల్‌ గెలిచి ఉంటే.. చరిత్ర సృష్టించేది. కానీ.. ఒక్క అడుగు దూరంలో సాత్విక్‌, చిరాగ్‌ల జోడీ నిలిచిపోయింది. 2017లో కిదాంబి శ్రీకాంత్‌ పురుషుల సింగిల్స్‌ విభాగంలో టైటిల్‌ సొంతం చేసుకోగా.. సైనా నెహ్వాల్‌ 2012 మహిళా విభాగంలో టైటిల్‌ విజేతగా నిలిచింది.

శనివారం జరిగిన పురుషుల డబుల్స్‌ సెమీ ఫైనల్లో భారత జోడీ 21-11, 25-23తో ఐదో సీడ్, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానంలో ఉన్న హిరోయుకి ఎండో-యుటా వతనాబె (జపాన్‌) జంటను ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. 50 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో ప్రారంభం నుంచే దూకుడు ప్రదర్శించిన సాత్విక్‌-చిరాగ్‌ జోడి ఏ దశలోనూ వెనక్కి తగ్గలేదు. జపాన్ ద్వయానికి అవకాశమే ఇవ్వకుండా రెండు గేమ్‌లలో తమ ఆధిపత్యానికి ప్రదర్శించింది.

ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ చాంపియన్‌ జోడీని, క్వార్టర్‌ ఫైనల్లో ఎనిమిదో ర్యాంక్‌ ద్వయంను బోల్తా కొట్టించిన భారత యువ జోడి సాత్విక్‌-చిరాగ్‌ సెమీ ఫైనల్లోనూ అదరగొట్టారు. టోర్నీ మొత్తం అద్భుత ప్రదర్శన చేసిన భారత జోడి.. ఫైనల్లో మాత్రం తడబడింది. రెండు గేమ్‌లలో గట్టి పోటీ ఇచ్చిన సాత్విక్‌-చిరాగ్‌ జోడీ కీలక సమయంలో తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది.

Story first published: Monday, October 28, 2019, 8:53 [IST]
Other articles published on Oct 28, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X