
పారిస్: గత టోర్నీలో తీవ్రంగా నిరాశపరిచిన భారత షట్లర్లు ఫ్రెంచ్ ఓపెన్‌లో దూకుడు ప్రదర్శిస్తున్నారు. సాత్విక్ సాయిరాజ్ రాంకీరెడ్డి-చిరాగ్ శెట్టి ఫ్రెంచ్ ఓపెన్ ఓపెన్‌లో సంచలనం సృష్టించారు. మూడు సార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఇండోనేషియా జోడీని పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో ఓడించారు. మరోవైపు భారత మహిళా స్టార్ షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్ ప్రిక్వార్టర్స్‌లో ప్రత్యర్థులపై విజయాలు సాధించారు.
గురువారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్స్‌లో సాత్విక్-చిరాగ్ జోడీ 21-18, 18-21, 21-13 తేడాతో రెండో సీడ్ ఇండోనేషియా జోడీ మహమ్మద్ అహ్సస్-హెండ్రా సెటివాన్‌పై విజయం సాధించి క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. 53 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన మ్యాచ్ తొలి గేమ్‌లో భారత జోడీ 3-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇండోనేషియా జోడీ పుంజుకుని ఓ దశలో 16-14తో పైచేయి సాధించింది. దూకుడు ప్రదర్శించిన భారత జోడి వరుసగా ఐదు పాయింట్లు సాధించి గేమ్‌ను కైవసం చేసుకుంది.
రెండో గేమ్‌లో ఇండోనేషియా జోడీ గెలవగా.. చివరి గేమ్‌లో భారత ద్వయం చెలరేగి 21-13తో గెలిచి సంచలనం సృష్టించింది. క్వార్టర్స్‌లో కిమ్ అస్ట్రప్-ఆండ్రెస్ స్కారప్స్మ్రుసెన్ (డెన్మార్క్)తో సాత్విక్-చిరాగ్ తలపడనున్నారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్‌లో ప్రపంచ చాంపియన్ సింధు 21-10, 21-13 తేడాతో 34 నిమిషాల్లోనే యియో జియా (సింగపూర్)ను చిత్తుగా ఓడించింది.
మరోవైపు వరుసగా మూడు టోర్నీల్లో తొలి రౌండ్‌కే పరిమితమైన సైనా నెహ్వాల్.. తన పేలవ ఫామ్‌కు చెక్ పెడుతూ అద్భుత ఆటతో ఆకట్టుకుంది. రెండో రౌండ్‌లో 21-10, 21-11 తేడాతో లైన్ హోజ్‌మార్క్ జేర్స్‌ఫెల్ట్ (డెన్మార్క్)పై సైనా సునాయాసంగా నెగ్గింది. క్వార్టర్స్‌లో అన్‌సే యంగ్ (కొరియా)తో సైనా తలపడనుంది. ఇక టాప్ సీడ్ తైజు యింగ్ (చైనీస్తై పీ) కూడా క్వార్టర్స్‌కు చేరింది.