ఫ్రెంచ్ ఓపెన్: తై జు యింగ్ చేతిలో మళ్లీ ఓడిన సైనా నెహ్వాల్

హైదరాబాద్: సైనా నెహ్వాల్‌కు మరోసారి చుక్కెదురైంది.. టోర్నీ మారినా.. అదే ప్రత్యర్థి చేతిలో మరో ఓటమి. పారిస్ వేదికగా జరుగుతున్న ఫ్రెంచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ సైనా 20-22, 11-21తో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయింది.

ఇది వరుసగా 12వసారి
తై జు చేతిలో ఓడడం సైనాకు ఇది వరుసగా 12వసారి కావడం గమనార్హం. గత ఆదివారం డెన్మార్క్ ఓపెన్ ఫైనల్లోనూ తై జు చేతిలో సైనా ఓడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌లో సైనా నెహ్వాల్ దూకుడుగా ఆడింది. కళ్లుచెదిరే షాట్లు ఆడిన సైనా వరుస పాయింట్లతో ప్రత్యర్థిని వెనక్కి నెట్టింది. ఒకానొక దశలో సైనా 16-9తో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.
అనూహ్యంగా పుంజుకున్న తై జు యింగ్
ఈ సమయంలో తై జు యింగ్ అనూహ్యంగా పుంజుకుంది. వరుస పాయింట్లు సాధించి 15-16తో సైనాను సమీపించింది. ఆ తర్వాత సైనా 20-16తో ఆధిక్యంలో ఉన్నప్పటికీ... ఆ తర్వాత వరుసగా ఆరు పాయింట్లు కోల్పోయి గేమ్‌ను చేజార్చుకుంది. రెండో గేమ్‌లో సైనా నెహ్వాల్ దూకుడుగా ఆడలేకపోయింది.

తొలి గేమ్ గెలిచిన ఆత్మవిశ్వాసంతో
తొలి గేమ్ గెలిచిన ఆత్మవిశ్వాసంతో విజృంభించిన తైజు 11-6తో ఆధిక్యంలోకి వెళ్లింది. అదే జోరులో వరుస పాయింట్లు సాధించి 17-8తో ఆధిక్యంలో నిలిచిన తైజు.. అదే ఊపులో 21-11తో గేమ్‌తో పాటు మ్యాచ్ గెలుచుకుంది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో సాయిప్రణీత్ 16-21, 14-21తో జొనాథన్ క్రిస్టి (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయాడు.

క్వార్టర్ ఫైనల్లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడీ
పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి (భారత్) జోడీ 21-17, 21-11తో సుమీత్ రెడ్డి-మను అత్రి (భారత్) జోడీపై గెలిచి సెమీస్‌లోకి ప్రవేశించింది. గురువారం క్వార్టర్ ఫైనల్లో సుమీత్-మను అత్రి జంట 21-16, 21-14తో ప్రపంచ ఐదో ర్యాంక్ జోడీ లియు చెంగ్-నాన్ జాంగ్ (చైనా)పై సంచలన విజయం సాధించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications