For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫ్రెంచ్ ఓపెన్‌లో తొలి రౌండ్ గెలిచి.. ప్రతీకారాన్ని తీర్చుకున్న సింధు

French Open: PV Sindhu exacts revenge against Beiwen Zhang

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌లో మూడో సీడ్‌ పీవీ సింధు అదరగొట్టేసింది. ఫ్రెంచ్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌-750 టోర్నమెంట్‌లో ఈ హైదరాబాద్‌ అమ్మాయి శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన సింగిల్స్‌ తొలిరౌండ్లో మూడోసీడ్‌ సింధు 21-17, 21-8 తో అమెరికా స్టార్‌ బీవెన్‌ జాంగ్‌ను చిత్తుచేసింది.

ఈ విజయంతో సింధు.. గతవారం డెన్మార్క్‌ ఓపెన్‌లో జాంగ్‌ చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నట్లు అయింది. కేవలం 34 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌లో సింధుకు కాస్త పోటీ ఇచ్చిన జాంగ్‌ రెండో గేమ్‌లో మాత్రం చేతులెత్తేసింది. మ్యాచ్‌ ఆరంభంలో జాంగ్‌దే కాస్త పైచేయి. కానీ సింధు క్రమంగా పుంజుకుంది.

7-4తో ఆధిక్యంలోకి దూసుకెళ్లిన ఆమె.. తర్వాత దాన్ని 10-6కు పెంచుకుంది. ఐతే జాంగ్‌ వరుసగా ఐదు పాయింట్లు సాధించి 11-10తో ఆధిక్యంలోకి వెళ్లింది. 16 పాయింట్ల వరకు పోరు హోరాహోరీ సాగింది. ఆ తర్వాత సింధు పైచేయి సాధించి తొలి గేమ్‌ను సొంతం చేసుకుంది.

అదే ఊపులో రెండో గేమ్‌లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. 11-6తో ఆధిక్యం సంపాదించిన సింధు.. ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇవ్వలేదు. సైనా, శ్రీకాంత్‌, సాయిప్రణీత్‌ బుధవారం తొలి రౌండ్‌ మ్యాచ్‌లు ఆడనున్నారు. పురుషుల డబుల్స్‌ తొలిరౌండ్‌లో భారత జంట అర్జున్‌-రామచంద్రన్‌ 14-21, 17-21తో లి జున్‌యు-లూ యుచెన్‌ (చైనా) జోడీ చేతిలో ఓడింది.

Story first published: Wednesday, October 24, 2018, 9:08 [IST]
Other articles published on Oct 24, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+