Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హిస్టరీ క్రియేట్ చేసిన స్వియటెక్.. మూడోసారి ఫ్రెంచ్ కిరీటం సొంతం!

ఫ్రెంచ్ ఓపెన్‌లో పోలండ్ స్టార్ ఇగా స్వియటెక్ చరిత్ర సృష్టించింది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలో దిగిన ఆమె తన టైటిల్‌ను నిలబెట్టుకొంది. శనివారం నాడు మహిళల సింగిల్స్‌ ఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా జరిగింది. ఈ మ్యాచ్‌లో టాప్‌ సీడ్‌ స్వియటెక్‌ (పోలెండ్‌) 6-2, 5-7, 6-4తో కరోలినా ముచోవా (చెక్‌ రిపబ్లిక్‌)ను ఓడించింది.

ఈ విజయంతో ఆమె రోలాండ్‌ గారోస్‌లో మూడోసారి విజేతగా నిలిచింది. ఇది గత నాలుగేళ్లలో 22 ఏళ్ల స్వియటెక్‌ సాధించిన మూడో ఫ్రెంచ్‌ కిరీటం కావడం గమనార్హం. ఆమె మొదటి సారి 2020లో ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గింది. ఇక గతేడాది కూడా చాంపియన్‌గా నిలిచింది. ఇప్పుడు తన టైటిల్ నిలబెట్టుకుంది. ఓవరాల్‌గా స్వియాటెక్‌కు ఇది నాలుగో గ్రాండ్‌స్లామ్.

 igaswiatek

ఇంతకుముందు ఆమె యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ కూడా గెలిచింది. ఇక ఫ్రెంచ్ ఓపెన్ విషయానికొస్తే.. ఇప్పటి వరకు ఈ టోర్నీలో ఒక్కసెట్‌ కూడా కోల్పోకుండా స్వియటెక్ ఫైనల్‌ చేరింది. అయితే ఫైనల్‌లో మాత్రం ముచోవా అద్భుతంగా ఆడింది. డిఫెండింగ్ ఛాంపియన్‌కు ముచ్చెమటలు పట్టించింది. ఈ మ్యాచ్ 2 గంటల 46 నిమిషాలపాటు సాగింది.

ఈ పోరులో కరోలినా 6 ఏస్‌లు వేస్తే.. ఇగా ఒక్కటి మాత్రమే సంధించింది. మ్యాచ్ ఆసాంతం ముచోవా చక్కటి ప్రదర్శన చేసింది. అయితే 38 అనవసర తప్పిదాలు కూడా చేయడంతో ఆమెకు ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్ తొలి సెట్‌ నుంచే స్వియటెక్‌ దూకుడుగా ఆడింది. రెండో గేమ్‌లోనే ప్రత్యర్థి సర్వీసును బ్రేక్‌ చేసి 3-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అదే జోరులో మొదటి సెట్‌ తన ఖాతాలో వేసుకుంది.

ఇక రెండో సెట్‌లో తొలి మూడు గేమ్‌లు నెగ్గిన స్వియటెక్‌ 3-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇక ఈ సెట్ కూడా ఆమెదే అనుకుంటున్న సమయంలో ముచోవా చెలరేగింది. ఐదో గేమ్‌లో స్వియటెక్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసి స్కోరును 3-3తో సమం చేసింది. ఇద్దరూ హోరాహోరీగా తలపడడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. ఒకానొక సమయంలో 5-5తో నిలిచిన ఈ సెట్ ముచోవా.. మరోసారి ఇగా సర్వీస్‌ను బ్రేక్‌ చేసి 7-5తో రెండో సెట్‌ తన ఖాతాలో వేసుకుంది.

నిర్ణాయక మూడో సెట్‌ ఆరంభంలోనే ఇగా సర్వీస్‌ను ముచోవా బ్రేక్ చేసింది. దీంతో ఆమె 2-0తో ముందంజ వేసింది. కానీ, ఆ తర్వాత వరుసగా మూడు గేమ్‌లు నెగ్గిన స్వియటెక్‌ 3-2తో పైచేయి సాధించింది. ఈ సెట్ నెగ్గేందుకు ఇద్దరూ నువ్వానేనా అన్నట్టుగా తలపడ్డారు. దీంతో స్కోరు 4-4తో సమమైంది. అయితే కీలక సమయంలో సత్తాచాటిన స్వియటెక్‌ బ్రేక్‌ పాయింట్‌తో సెట్‌ నెగ్గి మూడోసారి ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా నిలిచింది.

Story first published: Sunday, June 11, 2023, 15:48 [IST]
Other articles published on Jun 11, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+