For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫ్రెంచ్ ఓపెన్: రెండో రౌండ్‌కు దూసుకెళ్లిన సైనా, శ్రీకాంత్‌

French Open 2018: Saina, Srikanth through to second round

హైదరాబాద్: పారిస్ వేదికగా జరుగుతున్న ఫ్రెంచ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్ షట్లర్లు కిడాంబి శ్రీకాంత్‌, సైనా నెహ్వాల్‌, సాయి ప్రణీత్‌ రెండో రౌండ్‌కు దూసుకెళ్లారు. మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్లో సైనా 21-11, 21-11తో జపాన్‌ షట్లర్‌ సేనా కవాకమిపై విజయం సాధించింది.

ఇక, పురుషుల సింగిల్స్‌‌లో ఐదోసీడ్‌ శ్రీకాంత్‌ 21-19, 21-13తో వింగ్‌ కి విన్సెంట్‌ (హాంకాంగ్‌)ను ఓడించగా.... సాయి ప్రణీత్‌ 21-13, 21-17తో ఇగోర్‌ కోలె (బ్రెజిల్‌)పై గెలిచి రెండోరౌండ్‌ చేరారు. మరో భారత షట్లర్‌ సమీర్‌ వర్మ తొలిరౌండ్లో 21-16, 17-21, 15-21 తో జొనాథన్‌ క్రిస్టీ (ఇండోనేసియా) చేతిలో ఓడాడు.

పురుషుల డబుల్స్‌లో భారత్‌కు చెందిన సుమిత్‌ రెడ్డి-మను అత్రి జోడీ శుభారంభం చేసింది. తొలి రౌండ్లో ఈ జంట 21-18, 21-17తో మిన్‌ హ్యుక్‌ కాంగ్‌-కిమ్‌ వోన్‌ హో (కొరియా) జోడీ ఓడించింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ జోడీ 21-13, 21-15తో జర్మనీ జోడీపై జోన్స్‌-జోషెపై నెగ్గి రెండోరౌండ్లో ప్రవేశించింది.

మహిళల డబుల్స్‌ తొలిరౌండ్‌లో భారత జోడీ మేఘన-పూర్వీషా రామ్‌ 21-12, 21-12తో లిసె-ఫ్లోరె (బెల్జియం)ను ఓడించి రెండో రౌండ్లో అడుగుపెట్టింది. తొలి రౌండ్లో ఈ జోడీ 21-12, 21-12తో లిసీ జేక్స్‌-వాండెన్‌ హూక్‌ (బెల్జియం) జోడీని ఓడించింది.

Story first published: Thursday, October 25, 2018, 11:23 [IST]
Other articles published on Oct 25, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+