అవి రూమర్స్ మాత్రమే: ట్విట్టర్‌లో మాజీ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా

హైదరాబాద్: బిగ్‌బాస్ తెలుగు-3లో తాను కనిపించబోతున్నట్టు వస్తోన్న వార్తలపై మాజీ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా(35) స్పందించారు. టాలీవుడ్ మన్మధుడు నాగార్జున హోస్ట్‌గా చెబుతున్న బిగ్ బాస్-3లో పాల్గొనేందుకు తనను ఎవరినో సంప్రదించినట్టు సోషల్ మీడియాలో వస్తోన్న వార్తలు పూర్తిగా అవాస్తమని ట్విట్టర్‌లో ట్వీట్ చేసింది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా
జ్వాలా గుత్తా... బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా మాత్రమే కాకుండా ఓ తెలుగు సినిమాలోని ఐటమ్ సాంగ్‌లో మెరిసింది. నితిన్ హీరోగా వచ్చిన 'గుండె జారి గల్లంతయ్యిందే' సినిమాలోని ఓ పాటలో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చింది. దీంతో గుత్తా జ్వాల సినిమా ఇండస్ట్రీలో సెటిలవ్వాలనుకుంటోందనే వార్తలు తెరపైకి వచ్చాయి. అయితే ఆ దిశగా ప్రయత్నాలను ఆమె చేయలేదు.
తెరపైకి గుత్తా జ్వాలా పేరు
త్వరలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో మరోసారి గుత్తా జ్వాలా పేరు తెరపైకి వచ్చింది. ఈ సీజన్‌లో గుత్తా జ్వాలా కూడా పాల్గొనబోతోందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వార్తలతో ఆగ్రహానికి గురైన జ్వాల ట్విట్టర్ వేదికగా స్పందించారు. "నేను బిగ్ బాస్ చేయడం లేదు, అవి రూమర్స్ మాత్రమే" అని ట్వీట్ చేశారు.

రెమ్యూనరేషన్ విషయంలో డీల్ కుదరకే
అయితే, రెమ్యూనరేషన్ విషయంలో డీల్ కుదరకే గుత్తా జ్వాలా ఈ రియాల్టీ షో నుంచి తప్పుకుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఏది అయితేనేం కారణాలు ఏమైనప్పటికీ ‘బిగ్ బాస్ తెలుగు 3'లో గుత్తా జ్వాలా కనిపించడం లేదని తేలింది. అయితే, ఈ రియాలిటీ షోలో పాల్గొనేది ఎవరో త్వరలో అధికారికంగా వెల్లడికానుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications