
దాంతో సోదరులు ఇద్దరు కూడా తెలుగువారి ఖ్యాతిని ప్రపంచానికి చాటారు. వీరి విజయం పట్ల తల్లిదండ్రులు కేవీఎస్‌కృష్ణ, రాధాముకుందలు ఆదివారం సంతోషం వ్యక్తం చేశారు. వారు ఓ తెలుగు దినపత్రికతో తమ ఆనందాన్ని పంచుకున్నారు. తమ పిల్లలు ఏదో ఒక అంశంలో అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందాలని భావించామని తెలిపారు.
తమ పిల్లలిద్దరూ ఒకే రోజు విజయాలనందుకున్నందుకు త మ ఆ నందానికి అవధుల్లేవని అన్నారు. పిల్లలు ఇద్దరు పుల్లెల గోపీచంద్ అ కాడమీలో శిక్షణ పొందుతున్నారని తెలిపారు. తాము 12 ఏళ్లుగా పిల్లలు తమకు దూరంగా ఉన్నామని, అయితే ఈ విజయంతో ఆ బాధంతా మరచిపోయామని చెప్పారు. భ విష్యత్తులో వాళ్లు ఒలింపిక్ పతకం తీసుకురావాలనేది తమ కలని చెప్పారు.
ఇద్దరు సోదరులు కూడా అంతర్జాతీయ స్థాయిలో టైటిల్స్ గెలుచుకున్న భారత షటిలర్లుగా రికార్డు సృష్టించారు. కిరణ్ మనీషాతో కలిసి నందగోపాల్ మాల్దీవుల అంతర్జాతీయ మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. వీరు ఫైనల్లో కొరియాకు చెందిన సుంగ్ కిమ్, బో క్యూయింగ్‌లను ఓడించారు.