Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

దుబాయ్ సూపర్ సిరిస్ ఫైనల్స్‌: సెమీస్‌కు చేరిన పీవీ సింధు

Sensational Sindhu demolishes top seed Yamaguchi to top group

హైదరాబాద్: దుబాయి సూపర్ సిరిస్ ఫైనల్స్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు మరో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. శుక్రవారం జరిగిన నాకౌట్ పోరులో జపాన్ షటర్ల్ అకానె యమగుచిపై 21-9, 21-13తేడాతో ఘన విజయం సాధించి సెమీస్‌కు చేరింది.

తొలి సెట్‌ అరంభం నుంచే దూకుడుగా ఆడిన పీవీ సింధు తన ప్రత్యర్ధి యమగుచికి ఎంతమాత్రం అవకాశం ఇవ్వకుండా సొంతం చేసుకుంది. ఇక, రెండో సెట్‌లో యమగుచి ఒకానొక సమయంలో సింధుకి గట్టిపోటి ఇచ్చేలా కనిపించింది. 6-4 పాయింట్లలో సింధుపై యమగుచి ఆధిక్యం సాధించింది.

అయితే ఆ తర్వాత వెంటనే పుంజుకున్న సింధు భారీ స్కాష్‌లతో ప్రత్యర్దిపై పైచేయి సాధించింది. 36 నిమిషాలపాటు సాగిన హోరాహోరీ పోరులో సింధు 21-9, 21-13 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో దుబాయ్ సూపర్ సిరిస్ ఫైనల్స్‌లో సెమీస్‌కు చేరింది.

ఈ సూపర్‌ సిరీస్‌ గ్రూప్ దశలో మహిళ సింగిల్స్‌లో ఒక మ్యాచ్‌లో కూడా ఓడిపోని క్రీడాకారిణిగా సింధు మరో ఘనత సాధించింది. మయగూచిపై విజయం సాధించడంతో గ్రూప్-ఏలో పీవీ సింధు టాపర్‌గా నిలిచింది. మరోవైపు గ్రూప్‌-బిలో సెమీస్‌ బెర్తులు ఇంకా తేలలేదు. చివరి రౌండు ఫలితాల్ని బట్టి గ్రూప్-బీలో సెమీస్‌ చేరేదెవరో తేలుతుంది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Friday, December 15, 2017, 22:41 [IST]
Other articles published on Dec 15, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+