కొత్త లక్ష్యంతో పీవీ సింధు: తొలిసారి ఫేవరెట్‌గా బరిలోకి
హైదరాబాద్: బ్యాడ్మింటన్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూసే అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే టోర్నీకి రంగం సిద్ధమైంది. ఆద్యంతం హోరాహోరీగా, ఆసక్తికరంగా సాగే 'వరల్డ్ సూపర్ సిరీస్ మాస్టర్స్ ఫైనల్స్' బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతూ తన కంటూ ఓ ప్రత్యేక స్ధానాన్ని ఏర్పరచుకున్న రియో ఒలింపిక్ పతక విజేత, తెలుగు తేజం పీవీ సింధు టోర్నీలో ఫేవరెట్‌గా బరిలో దిగుతోంది.
ఈ మెగా ఈవెంట్‌లో బరిలోకి తొలిసారి అడుగు పెట్టిన సింధు తనదైన ముద్ర వేయాలనే లక్ష్యంతో ఆమె దుబాయ్‌లో అడుగుపెట్టింది. ఈ టోర్నీకి ఎంతో ప్రత్యేక ఉంది. అగ్రశ్రేణి క్రీడాకారుల కోసం ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) సీజన్ మొత్తంలో 12 సూపర్ సిరీస్ టోర్నమెంట్‌లు నిర్వహిస్తుంది. ఇందులో ఆరు సూపర్ సిరీస్ టోర్నీలు కాగా మరో ఆరు ప్రీమియర్ సూపర్ సిరీస్ టోర్నీలు ఉంటాయి.

12 సూపర్ సిరీస్ టోర్నీలు ముగిశాక
ఈ 12 సూపర్ సిరీస్ టోర్నీల్లో ప్రదర్శన ఆధారంగా క్రీడాకారులకు ర్యాంకింగ్స్ ఇస్తారు. అయితే ప్రపంచ ర్యాంకింగ్స్‌తో వీటికి సంబంధం ఉండదు. 12 సూపర్ సిరీస్ టోర్నీలు ముగిశాక ఈ టోర్నీల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా టాప్ 8స్థానాల్లో నిలిచిన వారు ‘మాస్టర్స్ ఫైనల్స్'కు అర్హత పొందుతారు.

2011లో భారత్ తరుపున సైనా
2011 నుంచి గత ఏడాది వరకు మహిళల సింగిల్స్‌లో భారత్ నుంచి సైనా నెహ్వాల్ ఈ టోర్నీలో ఆడింది. అయితే ఈసారి సైనాను వెనక్కినెట్టి సింధు ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి బెర్తు సాధించింది. చివరిదైన 8వ బెర్తు కోసం సైనా నెహ్వాల్, సింధు మధ్య పోటీ నెలకొంది. హాంకాంగ్ ఓపెన్‌లో సైనా క్వార్టర్స్‌లోనే నిష్క్రమించినా, సింధు ఫైనల్ చేరి రన్నరప్‌గా నిలవడంతో బెర్త్ సొంతం చేసుకుంది.

తొలి సూపర్ సిరీస్ పైనల్స్
దాంతో సూపర్ సిరీస్ ర్యాంకింగ్స్‌లో సింధు 46,290 పాయింట్లతో చివరిదైన 8వ బెర్త్ దక్కించుకుంది. 43,120 పాయింట్లతో సైనా తొమ్మిదో ర్యాంక్‌లో నిలిచి ఈ టోర్నీకి అర్హత పొందలేకపోయింది. కెరీర్‌లో ఆమెకిదే తొలి సూపర్ సిరీస్ టైటిల్. బుధవారం జరిగే తొలి రౌండ్ లీగ్ మ్యాచ్‌లో అకానె యామగుచితో సింధు ఆడుతుంది.

ప్రైజ్‌మనీ 10 లక్షల డాలర్లు
వీరి ముఖాముఖి రికార్డులో సింధు 2-1తో ఆధిక్యంలో ఉంది. గురువారం జరిగే రెండో లీగ్ మ్యాచ్‌లో సున్ యుతో ఆడుతుండగా, శుక్రవారం జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో కరోలినా మారిన్‌తో సింధు తలపడనుంది. 10 లక్షల డాలర్ల ప్రైజ్‌మనీతో ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు.

గ్రూప్ ‘బి’లో పీవీ సింధు
డిసెంబర్ 18 వరకు జరగనున్న ఈ టోర్నీలో సింధుతో పాటు ప్రపంచ నంబర్‌వన్ తై జు యింగ్ (చైనీస్ తైపీ), రియో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత, ప్రస్తుత ప్రపంచ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్), అకానె యామగుచి (జపాన్), సున్ యు (చైనా), హీ బింగ్‌జియావో (చైనా), సుంగ్ జీ హున్ (దక్షిణ కొరియా), ప్రపంచ మాజీ చాంపియన్ ఇంతనోన్ రచనోక్ (థాయ్‌లాండ్) పాల్గొంటున్నారు.

8 మంది క్రీడాకారిణుల్ని రెండు గ్రూపులుగా
8 మంది క్రీడాకారిణుల్ని రెండు గ్రూపులుగా విభజిస్తారు. గ్రూప్ ‘ఎ'లో తై జు యింగ్, సుంగ్ జీ హున్, రచనోక్, హీ బింగ్‌జియావోలు ఉన్నారు. గ్రూప్ ‘బి'లో పీవీ సింధు, మారిన్, యామగుచి, సున్ యు ఉన్నారు. ప్రతి గ్రూపులో ఒక్కో క్రీడాకారిణి మొత్తం మూడు మ్యాచ్‌లు ఆడుతుంది. మూడు మ్యాచ్‌ల అనంతరం గ్రూపులో తొలి రెండు స్థానాల్లో నిలిచే క్రీడాకారిణులు సెమీస్ చేరుకుంటారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications