Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

డెన్మార్క్‌ ఓపెన్‌: టైటిల్‌కు అడుగు దూరంలో సైనా, శ్రీకాంత్‌ ఇంటికి

 Denmark Open: Saina Nehwal in final, Kidambi Srikanth crashes out

హైదరాబాద్: భారత స్టార్ షట్లర్ డెన్మార్క్‌ ఓపెన్‌ టైటిల్‌కు ఒక్క మ్యాచ్‌ దూరంలో నిలిచింది. డెన్మార్క్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌-750 టోర్నీలో సైనా రెండోసారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్లో ప్రపంచ పదో ర్యాంకర్‌ సైనా 21-11, 21-12తో ప్రపంచ 19వ ర్యాంకర్‌ గ్రెగోరియా మరిస్కా టున్‌జుంగ్‌ (ఇండోనేసియా)పై విజయం సాధించింది.

ఆదివారం జరిగే ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్‌ తై జు యింగ్‌ (చైనీస్‌ తైపీ)తో సైనా తలపడనుంది. 30 నిమిషాల్లో ఆటను పూర్తి చేసిన సైనా 21-11,21-12 తేడాతో ఇండొనేసియాకు చెందిన మరిస్కాపై పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శించింది. రెండు గేమ్‌లను సైనా 13,17 నిమిషాల్లో సొంతం చేసుకుంది. 2012లో ఈ టోర్నీ టైటిల్‌ గెలిచిన సైనా ఈసారి అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగి అద్భుత ప్రదర్శన చేస్తోంది.

ఫైనల్లో తై జు యింగ్‌ రూపంలో సైనా సత్తాకు అసలు పరీక్ష

టోర్నీ భాగంగా తొలి మ్యాచ్‌ నుంచి కాబోయే భర్త పారుపల్లి కశ్యప్, కోచ్‌ సియాదత్‌ కోర్టు పక్కనే ఉంటూ సైనాకు సలహాలు ఇస్తున్నారు. తొలి మ్యాచ్‌లో రెండు మ్యాచ్‌ పాయింట్లను కాచుకొని గెలిచిన సైనా ఆ తర్వాతి మ్యాచ్‌ల్లో రెండో సీడ్‌ అకానె యామగుచి (జపాన్‌)పై, ఎనిమిదో సీడ్‌ ఒకుహారాపై గెలిచింది. అయితే ఫైనల్లో తై జు యింగ్‌ రూపంలో సైనా సత్తాకు అసలు పరీక్ష ఎదురుకానుంది.

 తై జు యింగ్‌పై గెలిచి సైనాకు ఐదేళ్లు

తై జు యింగ్‌పై గెలిచి సైనాకు ఐదేళ్లు

తై జు యింగ్‌పై గెలిచి సైనాకు ఐదేళ్లు దాటింది. ఇప్పటివరకు వీరిద్దరు 17 సార్లు తలపడగా తై జు యింగ్‌ 12 మ్యాచ్‌ల్లో సైనా 5 మ్యాచ్‌ల్లో గెలిచారు. 2013 స్విస్‌ ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో తై జు యింగ్‌పై గెలిచిన తర్వాత ఆమెతో ఆడిన గత పది మ్యాచ్‌ల్లో సైనా ఓడిపోయింది. ఇక, ఈ ఏడాది తై జు యింగ్‌తో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ సైనా ఓటమిపాలైంది.

కిదాంబి శ్రీకాంత్‌ ఇంటికి

కిదాంబి శ్రీకాంత్‌ ఇంటికి

సైనా ఫైనల్‌లో అడుగుపెట్టగా, మరో స్టార్ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్‌.. ప్రపంచ నంబర్‌ వన్‌, జపాన్ షట్లర్ కెంటో మొమోటా చేతిలో ఓటమి పాలయ్యాడు. పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లో ప్రపంచ ఆరో ర్యాంకర్‌ శ్రీకాంత్‌ 16-21, 12-21 స్కోరుతో నెంబర్‌ వన్‌ ర్యాంకర్‌ కెంటో మొమొటా (జపాన్‌) చేతిలో వరుస గేముల్లో కంగుతిన్నాడు. 42 నిమిషాలు పాటు సాగిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్ తుదికంటా పోరాడాడు.

 కిదాంబి శ్రీకాంత్‌పై పూర్తి ఆధిక్యం

కిదాంబి శ్రీకాంత్‌పై పూర్తి ఆధిక్యం

కెంటో... కిదాంబి శ్రీకాంత్‌పై పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శించాడు. శ్రీకాంత్ చేసిన తప్పిదాలను కెంటో విజయవంతంగా ఉపయోగించుకున్నాడు. కెంటో, శ్రీకాంత్‌ ఇప్పటివరకు ఎనిమిది మ్యాచు‌ల్లో తలపడగా కెంటో ఐదుసార్లు పైచేయి సాధించాడు. మహిళల డబుల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో సిక్కిరెడ్డి-అశ్వినీ పొన్పప్ప జోడీ 14-21, 12-21 స్కోరుతో టాప్‌సీడ్‌ యూకి ఫుకుషిమ-సయాక హిరోట (జపాన్‌) చేతిలో ఓడిపోయింది.

Story first published: Sunday, October 21, 2018, 10:49 [IST]
Other articles published on Oct 21, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+