Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సింధుకు షాక్..తొలి రౌండ్లోనే వెనుదిరగాల్చి వచ్చింది!!

Denmark Open: PV Sindhu eliminated after narrow defeat against Beiwen Zhang in opening round

న్యూ ఢిల్లీ: భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధుకు ఊహించని షాకులు తగులుతున్నాయి. ఆసియా క్రీడల్లో రజత పతకం గెలిచిన తర్వాత ఆమెకు ప్రతి టోర్నీలోనూ గడ్డు పరిస్థితులే ఎదురవుతున్నాయి. ప్రిలిమినరీ పోటీల్లోనే నిష్ర్కమిస్తోంది. తాజాగా డెన్మార్క్‌ ఓపెన్‌‌ మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లోనే ఆమె పరాజయం పాలైంది.

తొలి రౌండ్లో అమెరికన్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి బీవెన్ జంగ్ చేతిలో అనూహ్య ఓటమిని చవిచూసింది. మూడో సీడ్‌గా బరిలోకి దిగిన సింధూ అమెరికా షట్లర్‌ బీవెన్‌ ఝంగ్‌తో జరిగిన పోరులో 17-21, 21-16, 18-21 తేడాతో ఓటమి చవిచూసింది. దాదాపు గంట పాటు వీరిద్దరూ హోరాహోరీగా పోరాడారు.

జంగ్ చేతిలో సింధు ఓడిపోవడం వరుసగా ఇది మూడోసారి. ఈఏడాది ఫిబ్రవరిలో ఇండియన్ ఓపెన్ ఫైనల్లోనూ సింధుపై అమెరికన్ షట్లర్‌దే పైచేయి కావడం గమనార్హం. టోర్నమెంట్లో మూడో సీడ్‌గా బరిలో దిగిన సింధు కొద్దిరోజులుగా తన మునుపటి ప్రదర్శనను కనబర్చలేకపోతోంది. కచ్చితంగా పతకంతో తిరిగొస్తుందని ఆశించిన అభిమానులకు నిరాశే మిగిలింది.

ఫిబ్రవరిలో జరిగిన ఇండియన్‌ ఓపెన్‌ ఫైనల్లోనూ ఝంగ్‌ ఇదే ప్రదర్శన పునరావృతం చేసింది. జపాన్‌ ఓపెన్‌ రెండో రౌండ్‌లో సింధుపై గావో ఫంగ్‌జి గెలిచింది. ఇక చైనా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో 11-21, 21-11, 15-21 తేడాతో చెన్‌ యూఫీ సైనా నెహ్వాల్‌పై విజయకేతనం ఎగరేసింది.

Story first published: Tuesday, October 16, 2018, 19:18 [IST]
Other articles published on Oct 16, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+