Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సింధుకు షాక్‌: డెన్మార్క్ ఓపెన్‌లో ముగిసిన భారత్ పోరు

హైదరాబాద్: రియో ఒలింపిక్స్ పతక విజేత, భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు ఊహించని ఓటమి ఎదురైంది. ఒలింపిక్స్ తర్వాత ఆడిన తొలి టోర్నీలో సింధుకు ఎదురుదెబ్బ తగిలింది. డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో సింధు ఓటమితో భారత పోరాటం ముగిసింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గురువారం జరిగిన ప్రీ క్వార్టర్స్‌ మ్యాచ్‌లో ఆరో సీడ్ సింధు 13-21, 23-21, 18-21తో అన్‌సీడెడ్ జపాన్ క్రీడాకారిణి సయాకా సాటో చేతిలో పరాజయం పాలైంది. మొదటి గేమ్‌లో సింధు తొలుత 1-3తో వెనుకబడినా ఆ తర్వాత పుంజుకుని 12-8తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

ఆ తర్వాత సయాకా వరుసగా 7 పాయింట్లు సాధించి 21-13తో తొలి గేమ్‌ను కైవసం చేసుకుంది. ఇక రెండో గేమ్‌లోనూ ఒక దశలో 10-15తో వెనకబడ్డ సింధు పట్టు వదలకుండా పోరాడి 21-21తో స్కోరు సమం చేసింది. అనంతరం రెండు మ్యాచ్‌ పాయింట్లు సింధుకు రావడంతో 23-21తో గేమ్‌ను తన ఖాతాలో వేసుకుంది.

Denmark Open Badminton: PV Sindhu Loses As Indian Campaign Ends

మూడో గేమ్‌లో 14-14.. 18-18 ఇలా మ్యాచ్‌ నువ్వానేనా అన్నట్టుగా సాగింది. ఈ దశలో సయాక అద్భుతంగా ఆడి వరుసగా మూడు పారుుంట్లతో సింధుకు షాక్ ఇచ్చింది. స్కోరు సమంగా ఉన్న సమయంలో సింధు చేసిన అనవసర తప్పిదాలు ఆమె కొంపముంచాయి.

గెలుస్తుందనుకున్న సింధు మూడో గేమ్‌‌లో 18-21తో ఓటమి పాలయింది. గతేడాది జరిగిన డెన్మార్క్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌లో సింధు రన్నరప్‌గా నిలిచింది. కాగా ఈసారి రెండో రౌండ్లోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక పురుషుల ఈవెంట్‌లోనూ భారత క్రీడాకారులకు నిరాశే ఎదురైంది.

పురుషుల సింగిల్స్‌లో హెచ్‌ఎస్‌ ప్రణయ్‌, అజయ్‌ జయరామ్‌ కూడా రెండో రౌండ్‌లోనే టోర్నీ నుంచి నిష్క్రమించారు. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో అజయ్ జయరామ్ 21-23, 15-21తో యుకిషి (చైనా) చేతిలో ఓటమి పాలవ్వగా, ప్రణయ్ 10-21, 20-22తో టాప్ సీడ్ లీ చోంగ్ వీ (మలేసియా) చేతిలో పరాజయం పాలయ్యాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:11 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+