For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్: మారిన్ గెలిచినా హైదరాబాద్ ఓటమి

By Nageshwara Rao
Delhi Dashers rout Hyderabad Hunters in Premier Badminton League

హైదరాబాద్: ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ (పీబీఎల్‌)లో టైటిల్‌ ఫేవరెట్‌‌గా బరిలోకి దిగిన హైదరాబాద్ హంటర్స్‌కు మరో షాక్ తగిలింది. హంటర్స్ ప్రధాన క్రీడాకారిణి కరోలినా మారిన్ గెలిచినప్పటికీ ఆ జట్టుని ఓటమి నుంచి కాపాడలేకపోయింది. దీంతో లీగ్‌లో హంటర్స్ వరుసగా రెండో పరాజయాన్ని చవిచూసింది.

ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ డాషర్స్‌ 5-0తో హంటర్స్‌పై ఘన విజయం సాధించింది. తొలుత పురుషుల డబుల్స్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీకి చెందిన ఇవనోవ్-సొజొనోవ్ జోడీ 15-9, 15-11తో మార్కిస్ కిడో-యూ షియాంగ్‌పై విజయం సాధించింది.

దీంతో 1-0తేడాతో ఢిల్లీ ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత జరిగిన పురుషుల సింగిల్స్‌లో విన్సెంట్ (ఢిల్లీ) 13-15, 15-11, 15-4తో లీ హ్యున్‌పై గెలిచి ఢిల్లీ ఆధిక్యాన్ని కొనసాగించాడు. ఇది హంటర్స్‌కు ట్రంప్‌ మ్యాచ్‌ కావడంతో ఢిల్లీ 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.

ఆ తర్వాత మహిళల సింగిల్స్‌లో హంటర్స్‌ కెప్టెన్, ఒలింపిక్‌ విజేత కరోలినా మారిన్‌ 15-10, 15-12తో సంగ్‌ జీ హ్యూన్‌పై విజయం సాధించినా... అప్పటికే ఢిల్లీ జట్టు 3-0 ఆధిక్యంతో విజయం ఖరారు చేసుకుంది. అయితే ఢిల్లీ తమ ట్రంప్ కార్డ్ మ్యాచ్ పురుషుల సింగిల్స్‌లో హువేయ్ 15-14, 14-15, 15-10తో సాయి ప్రణీత్ (హైదరాబాద్)పై నెగ్గాడు.

దీంతో ఢిల్లీ డాషర్స్ తన అధిక్యాన్ని 5-0కు పెంచుకుని మ్యాచ్‌ని సొంతం చేసుకుంది.

Story first published: Monday, January 1, 2018, 10:50 [IST]
Other articles published on Jan 1, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+