
బ్యాడ్మింటన్‌లో పోటీ పెరిగింది
'మహిళల సింగిల్స్‌లో ఒకప్పుడు చైనా అమ్మాయిలదే ఆధిపత్యం. ఇప్పుడు ఆస్థానాన్ని సింధులాంటి వాళ్లు ఆక్రమించారు. బ్యాడ్మింటన్‌లో పోటీ పెరిగింది. ఇలా అనేకమంది చాంపియన్లు రావడం బ్యాడ్మింటన్‌కు మంచిదే. ప్రస్తుతం చాలా మంది క్రీడాకారులు అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. తమదైన రోజున ఎవరినైనా ఓడించగలుగుతారు. కాబట్టి ప్రత్యర్థి ఎవరైనా అత్యుత్తమ ఆటతీరు కనబరచాల్సిందే' అని పేర్కొన్నాడు.

డాన్, లీ చాంగ్‌ల కెరీర్‌ల ముగింపు దశపై నేనేమీ మాట్లాడను
'డాన్, లీ చాంగ్‌ల కెరీర్‌ల ముగింపు దశ గురించి నేనేమీ మాట్లాడలేను. ప్రపంచ బ్యాడ్మింటన్ రంగంలో అత్యున్నత స్థాయిలో ఆడిన అనుభవం వారికి ఉంది. అలానే పుంజుకునే సత్తా కూడా వారికి ఉంది. వాళ్ళని తేలిగ్గా తీసుకోలేం. వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో డాన్ ఫైనల్ చేరుకున్నాడు' అని శ్రీకాంత్ అన్నాడు.

ర్యాంకింగ్స్ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు
'ఇక ర్యాంకింగ్స్ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. గత 8, 10 నెలలుగా మంచి గేమ్ ఆడుతున్నా. భవిష్యత్తులోనూ ఇలాగే ఆడుతూ ఆటను ఆస్వాదించాలని అనుకుంటున్నా. వచ్చేవారం జాతీయ చాంపియన్‌షిప్‌లో ఆడబోతున్నా. ఆ తర్వాత చైనా, హాంకాంగ్ ఓపెన్, డిసెంబర్‌లో వరల్డ్ సూపర్‌సిరీస్ ఫైనల్స్‌లో తలపడుతా. నిలకడగా విజయాలు సాధిస్తుంటే ర్యాంకులు అవే వస్తాయి. కాబట్టి ర్యాంకుల వెనుక పరుగెత్తాల్సిన పనిలేదు' అని శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు.

కిదాంబి శ్రీకాంత్‌కు తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం
ఉపాధ్యక్షుడు చాముండేశ్వరినాథ్ వ్యక్తిగతంగా రూ.10 లక్షలు నగదు ప్రోత్సాహకం అందజేశారు. మంగళవారం గోపీచంద్ అకాడమీలో శ్రీకాంత్‌కు రూ.10 లక్షల చెక్కు ఇచ్చారు. ఈ సందర్భంగా చాముండి మాట్లాడారు. '2014లో చైనా ఓపెన్‌లో లిన్ డాన్‌ను ఓడించినప్పుడు శ్రీకాంత్‌కు కారు బహుకరించా. ఇప్పుడు రూ.10 లక్షలు ఇస్తున్నా. ఇవన్నీ వ్యక్తిగతంగా ఇస్తున్నవే. క్రీడాకారుల్ని ప్రోత్సహిస్తుండటం నాకెంతో ఆనందంగా ఉంది' అని తెలిపారు.


Click it and Unblock the Notifications











