మంచి భార్య రావాలని ఎప్పుడూ కోరుకోలేదు: సైనాను ఉద్దేశించి పారుపల్లి కశ్యప్

హైదరాబాద్: భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్లు పారుపల్లి కశ్యప్, సైనా నెహ్వాల్‌లకు పెళ్లి జరిగి సరిగ్గా ఏడాది ముగిసింది. ఈ సందర్భంగా పారుపల్లి కశ్యప్ తన ఇనిస్టాగ్రామ్‌లో తన భార్య సైనా నెహ్వాల్‌పై ఉన్న ప్రేమను తెలియజేశాడు. అంతేకాదు వాళ్లిద్దరూ కలిసి ఉన్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు.
ఈ సందర్భంగా "ఈ ప్రపంచంలో అత్యంత అద్భుతమైన మహిళవు నువ్వు. మంచి భార్య రావాలని ఎప్పుడూ కోరుకోలేదు. మొదటి సంవత్సరాన్ని చాలా అద్భుతంగా చేసినందుకు నీకు ధన్యవాదాలు. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నా. పెళ్లిరోజు శుభాకాంక్షలు" అని కామెంట్ పెట్టాడు.
మరోవైపు సోషల్ మీడియాలో నెటిజన్లు సైతం వీరిద్దరికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పదేళ్లకుపైగా తమ ప్రేమ విషయాన్ని రహస్యంగా ఉంచిన సైనా-కశ్యప్‌లు గతేడాది వివాహ బంధంతో ఒక్కటయ్యారు. చాలా సింపుల్‌గా జరిగిన వీరి పెళ్లికి బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.
పెళ్లి అనంతరం తెలుగు రాష్ట్రాల్లోని సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులకు విందు ఇచ్చారు. కాగా, భారత్‌కు ఒలింపిక్ పతకం అందించిన తొలి మహిళా క్రీడాకారిణిగా సైనా నెహ్వాల్ నిలిచిన సంగతి తెలిసిందే. 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించడం ద్వారా సైనా ఈ ఘనత సాధించింది.
త్వరలో సైనా జీవితం ఆధారంగా బాలీవుడ్‌లో సినిమా కూడా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో సైనా పాత్రను బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా పోషిస్తున్నారు. ఇక, కశ్యప్ విషయానికి వస్తే అనేక మ్యాచ్‌ల్లో భారత్‌కు విజయాలను అందించాడు. వీరిద్దరూ పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో మొదటిసారి కలుసుకున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications