
హైదరాబాద్: భారత్ దేశ మాజీ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, ప్రస్తుత జాతీయ కోచ్ పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ క్రీడాకారులనుద్దేశించి పలు వివాదస్పదమైన వాఖ్యలు చేశాడు.
బ్యాడ్మింటన్ క్రీడాకారులు అవసరానికి మించి టోర్నీలు ఆడుతున్నారని అన్నాడు.
బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె క్రీడాకారులు అతిగా ఆడుతున్నారన్న వ్యాఖ్యలపై గోపీ స్పందించాడు. అవును కొంచెం ఎక్కువే చేస్తున్నారు. అంటూ బదులిచ్చాడు. బ్యాడ్మింటన్ క్రీడాకారులు అవసరానికి మించి టోర్నీలు ఆడుతున్నారన్న మాట వాస్తవమే. టోర్నీల మధ్య విరామం ఉండాల్సిందే.
అయితే భారత్ ఒక్కటే తీరికలేని షెడ్యూల్‌తో బిజీగా ఉందనుకోవద్దని హితవు పలికాడు. ఇదే పరిస్థితి పూర్తి ప్రపంచమంతా ఉందంటూ వివరణ ఇచ్చాడు. కామన్వెల్త్ క్రీడలు, ఆసియా క్రీడలతో భారత్ పరిస్థితి మరీ ఇబ్బందికరంగా ఉందన్నాడు.
ఇంకా ఆయన మాట్టాడుతూ.. ఐరోపా దేశాలు కామన్వెల్త్ క్రీడలు, ఆసియా క్రీడల్లో బరిలో దిగవు. మనకు ప్రత్యమ్నాయం లేదు. టోర్నీలకు వెళుతూనే సాధన చేయాలి. కామన్వెల్త్ క్రీడలు చాలా ముఖ్యమైన టోర్నీ. అగ్రశ్రేణి క్రీడాకారుల్నే పంపాలి. ప్రపంచ సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో సింధు ప్రదర్శన సంతృప్తినిచ్చింది. ఆమెకు మంచి భవిష్యత్తు ఉంది'' అని గోపీచంద్ తెలిపాడు.
ఇదే నెలలో జరిగిన దుబాయ్ సిరీస్ ఫైనల్స్‌లో పీవీ సింధు రజితంతో సరిపెట్టుకుంది. విరామం అనంతరం మ్యాచ్‌లు ఆడుతూ అజేయంగా దూసుకుపోతున్న కిదాంబి శ్రీకాంత్‌కు ఈ సారి ఖాళీ చేతులతోనే వెనుదిరిగాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.