For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అరుదైన గౌరవం: కామన్వెల్త్‌ గేమ్స్‌లో ఫ్లాగ్ బేరర్‌గా పీవీ సింధు

By Nageshwara Rao
Commonwealth Games 2018: PV Sindhu to be the flag-bearer

హైదరాబాద్: భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు అరుదైన అవకాశాన్ని దక్కించుకుంది. ఏప్రిల్ 4 నుంచి ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌ వేదికగా ప్రారంభం కానున్న కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత జట్టుకు ఫ్లాగ్ బేరర్‌గా వ్యవహరించనుంది. టోర్నీలో భాగంగా ఏప్రిల్‌ 4న గోల్డ్‌కోస్ట్‌లోని కరార స్టేడియంలో ఆరంభ వేడుకలు జరగనున్నాయి.

నెల జీతం సరిపోవడం లేదు: చిన్నారి కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన

ఈ వేడుకల్లో భాగంగా భారతీయ అథ్లెట్ల బృందానికి పీవీ సింధు త్రివర్ణ పతాకంతో నాయకత్వం వహిస్తారు. రియో ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ గెలిచిన సింధుకు ఈ అరుదైన ఘనత దక్కింది. భారత జట్టులో మేరి కోమ్‌, సైనా నెహ్వాల్‌ లాంటి సీనియర్‌ క్రీడాకారులున్నప్పటికీ సింధును ఫ్లాగ్ బేరర్‌గా ఎన్నుకోవడం విశేషం.

ఈ మధ్య కాలంలో సింధు సాధిస్తున్న విజయాల కారమంగానే ఆమెను పతాకధారిగా ఎంపిక చేసినట్లు భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) అధికారి ఒకరు తెలిపారు. అంతకముందు 2006లో మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన కామన్వెల్తే గేమ్స్‌లో ప్రస్తుత క్రీడా శాఖ మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాధోడ్ భారత బృంధానికి నాయకత్వం వహించారు.

కొత్త AI powered cameraతో OPPO F7, 25 ఎంపీ AI సెల్ఫీ కెమెరాతో..

2010లో ఢిల్లీ వేదికగా జరిగిన గేమ్స్‌లో... బీజింగ్ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతక విజేత అభినవ్ బింద్రా మార్చ్‌పాస్ట్‌లో పాల్గొన్నారు. 2014 గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో... లండన్ ఒలింపిక్స్‌లో వెండి పతక విజేత షూటర్ విజయ్ కుమార్ ఈ బాధ్యతలను నిర్వర్తించారు. మొత్తం 222 మంది క్రీడాకారులు ఈ సారి కామన్వెల్త్‌ క్రీడల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

క్రీడాకారుల అభ్యర్థన మేరకు ఈసారి ప్రారంభ వేడుకల్లో భారత క్రీడాకారిణీలు చీరలకు బదులు కోటు, ట్రౌజర్ ధరించనున్న సంగతి తెలిసిందే. ఈ కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధిస్తారని భారీ అంచనాలున్న క్రీడాకారుల్లో సింధు ఒకరు. 2014 గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల సింగిల్స్‌లో సింధు కాంస్య పతకంతో మెరిసింది.

కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ పాల్గొనడం ఇది 15వ సారి. మొత్తం 15 క్రీడా విభాగాల్లో భారత్‌ క్రీడాకారులు బరిలోకి దిగుతున్నారు. మొత్తం 70 దేశాలు ఈ కామన్వెల్త్‌ గేమ్స్‌లో పాల్గొంటున్నాయి. 1930లో ప్రారంభమైన ఈ కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌ ఇప్పటివరకు మొత్తం 438 పతకాలు సాధించింది.

Story first published: Saturday, March 24, 2018, 15:58 [IST]
Other articles published on Mar 24, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+