
హైదరాబాద్: చైనా ఓపెన్ సూపర్ సిరిస్ టోర్నీలో ఒలింపిక్ ఛాంపియన్ చెన్ లాంగ్ సొంతగడ్డపై అద్భుత ప్రదర్శన చేశాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఆరోసీడ్ చెన్ లాంగ్ (చైనా) 21-16, 14-21, 21-13తో అక్సెల్సెన్ (డెన్మార్క్)పై అద్భుత విజయం సాధించాడు.
72 నిమిషాల పాటు సాగిన ఫైనల్లో ఆరంభం నుంచే ఆధిపత్యం చెలాయించిన చెన్ లాంగ్.. వరల్డ్ నెంబర్‌వన్‌పై పైచేయి సాధించాడు. సొంత అభిమానుల మద్దతు మధ్య స్మాష్‌లు, డ్రాప్‌షాట్లు, నెట్ గేమ్‌తో అక్సెల్సెన్ విక్టర్‌ను కంగుతినిపించాడు.
తన కెరీర్‌లో చైనా ఓపెన్ సూపర్ సిరీస్‌లో విజేతగా నిలవడం చెన్ లాంగ్‌కు ఇది నాలుగోసారి కాగా 2013 తర్వాత ఇదే తొలిసారి. మరోవైపు మహిళల సింగిల్స్‌లో ఫైనల్స్‌లో అకానె యమగుచి 21-13, 21-15తో గావో ఫాంగ్‌జీ(చైనా)పై అలవోక విజయం సాధించింది.
ఫైనల్లో జపాన్ షట్లర్, ఐదోసీడ్ అకానె యమగుచి 21-13, 21-15తో చైనా క్వాలిఫయర్ గావో ఫాంజీపై విజయం సాధించింది. ఈ ఏడాది యమగుచికి ఇదే తొలి సూపర్ సిరీస్ టైటిల్.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.